ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన విజయవాడలో తెదేపా పాలిట్ బ్యూరో సమావేశం జరుగుతోంది. తెదేపా ప్రతీఏటా నిర్వహించుకొనే మహానాడు సమావేశాలను ఈనెల 27,28,29 తేదీలలో తిరుపతిలో జరపాలని సమావేశంలో నిర్ణయించారు. దాని నిర్వహణ కోసం ఈ సమావేశంలోనే కమిటీల ఏర్పాటుపై చర్చిస్తున్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ని మంత్రిగా మంత్రివర్గంలో తీసుకొనే ఆలోచనను ముఖ్యమంత్రి విరమించుకొన్నారు కనుక ఆయనను మహానాడు సమావేశాలలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బహుశః ఈరోజు పోలిట్ బ్యూరో సమావేశంలో దీనిపై కూడా తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది.