పాపం ఛార్మి. ఈ మధ్య ఆమెకు ఏమీ కలసి రావడం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకొన్న జ్యోతిలక్ష్మి తుస్సుమంది. పూరితో దూరం దూరంగా ఉండాల్సివస్తోంది. అవకాశాలూ రావడం లేదు. ఆఖరికి ఐటెమ్ సాంగులూ కనికరించడం లేదు. ఛార్మిని జనం మర్చిపోతున్నారు.. సినిమావాళ్లూ మర్చిపోతున్నారు. ఆమె కూడా ఇక నాకు అవకాశాలు రావులే అని ఫిక్సయిపోతోంది. ఇవి చాలవన్నట్టు.. దురదృష్టం కూడా వెంటాడుతోంది. సోమవారం ఛార్మి హ్యాండ్ బ్యాగ్ పోయింది. అందులో ఓ వజ్రం, విలువైన వస్తువులు, ఫోనూ ఉన్నాయట. ఈ విషయాన్ని ఛార్మినే ట్విట్టర్లో పోస్ట్ చేసింది.
”నన్ను ద్వేషించేవాళ్లకు ఓ శుభవార్త.. నా బ్యాగు పోయింది” అంటూ.. ట్వీట్ చేసింది. అంటే టాలీవుడ్ లో ఆమెకు శత్రువులు ఉన్నారన్నమాట. వాళ్లంతా ఛార్మి బ్యాగు పోతే పండగ చేసుకొంటారన్నమాట. అన్ని రోజులు మనవి కావులే.. అంటూ వేదాంత ధోరణిలో మాట్లాడుతోంది ఛార్మి. ఆమె నోటికి వేదాంతం సెట్ కాకపోయినా… బ్యాగ్ పోయిన బాధలో ఉంది కాబట్టి పోనీలే అని మనం కూడా సర్దుకుపోవొచ్చు. అయితే ఈ బ్యాగ్ పోయిన విషయాన్ని పోలీసులకు పిర్యాదు చేయలేదు ఛార్మి. అంటే ఎవరైనా కొట్టేశారా, లేదంటే.. తనే ఎక్కడో పెట్టి మర్చిపోయిందా.. ఎవరైనా సరదాగా దాచేశారా.. ఈ విషయాలేం చెప్పడం లేదు. బ్యాగులో డైమండ్స్ పెట్టుకొని తిరుగుతోంటే… అవిపోయినప్పుడు పోలీసులకు చెప్పాలి కదా? ఎందుకు చెప్పలేదు చెప్మా?