అ…ఆ కథా వస్తువు త్రివిక్రమ్ జీవితమేనా?? త్రివిక్రమ్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా అ… ఆ కథ పుట్టిందా?? అవును.. అ ఆ ఆడియో ఫంక్షన్లో త్రివిక్రమ్ స్పీచ్ వింటే అదే అనిపిస్తోంది. ”నేను రాసేసిన డైరీ.. ఇది” అని త్రివిక్రమ్ స్వయంగా చెప్పాడు. ”మన మూలాల్ని మర్చిపోతుంటాం. వాటిని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొనే ప్రయత్నం చేయాలి. అదే.. ఈ సినిమా. కొన్ని ప్రయాణాల్ని ఎప్పటికీ ఆపాలనిపించదు. కొన్ని అనుభూతుల్ని ఎంత పంచుకొన్నా తనివి తీరదు. రాసేసిన డైరీని మళ్లీ ఒక్కసారి చదువుకోవాలనిపిస్తుంటుంది. అ ఆ కూడా నేను ఎప్పుడో రాసేసిన డైరీ. ఇప్పుడు మళ్లీ చదువుకొంటున్నా” అంటున్నాడు త్రివిక్రమ్.
ఈ మాటల్ని బట్టి చూస్తే.. అ… ఆ కథకు మూలం త్రివిక్రమ్ జీవితమే అనిపిస్తుంది. అతని జీవితంలో ఎదురైన అనుభవాలు, స్నేహాలూ, ప్రయాణాలూ, సమస్యలు, సరదాలూ ఇవన్నీ కలిపితే అ ఆ అనుకోవొచ్చేమో? సన్నాఫ్ సత్యమూర్తి సినిమా బాగానే ఉన్నట్టు అనిపించినా, త్రివిక్రమ్ మార్క్ కాస్త తగ్గిందేమో అనిపించింది. మళ్లీ ఈ సినిమాతో త్రివిక్రమ్ తన మార్క్‌ని అందుకొనే ప్రయత్నం చేశాడన్నది సుస్పష్టం. మరి త్రివిక్రమ్ ఇష్టపడి రాసుకొన్న డైరీ.. టాలీవుడ్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో తెలియాలంటే అ ఆ రిలీజ్ కావల్సిందే.