రాజుగారి గది లాంటి సినిమాల్లో మంచి పేరు తెచ్చుకొన్న హాస్యనటి విద్యుల్లేఖరామన్. ఈమద్య సరైనోడులోనూ బన్నీకి వదిన పాత్రలో కనిపించింది. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకొంటూ ఇప్పుడిప్పుడే స్థిరపడుతోంది. అలాంటి ఈమెకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ప్రస్తుతం ఆస్ట్రియాలో ఉంది విద్యుల్లేఖ. అక్కడ ఈరోజు తన బ్యాగ్ పోయింది. ఓ హోటెల్‌లో బస చేస్తున్న ఈమె దగ్గరకు ఎవరో అగంతకులు వచ్చి మాటల్లో పెట్టి, హ్యాండ్ బ్యాగ్ ఎత్తుకుపోయారట. అందులోనే తన పాస్ పోర్టు కూడా ఉంది. దాంతో.. ఆస్ట్రియాలోనే ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హోటెల్ ఫుటేజీలు ఇస్తే ఎవరు దొంగిలించారో కనుక్కోవడం సులభం అవుతుందని భావించినా, ఈ విషయంలో ఆమెకు హోటెల్ యాజమాన్యం సహకరించడం లేదట. ఆస్ట్రియాలో ఉన్న భారతీయ దౌత్యాధికారులను సంప్రదించి ఈ సమస్య నుంచి బయటపడాలని చూస్తోంది విద్యుల్లేఖ. మరి ఏమవుతుందో..!