అఖిల్ రెండో సినిమా చిక్కుల్లో పడింద….ట, బడ్జెట్ ఎక్కువైపోవడంతో మైత్రీ మూవీస్ సంస్థ ఈ సినిమా నుంచి తప్పుకొంద…..ట, దాంతో అఖిల్ నిర్మాతల కోసం అన్వేషిస్తున్నాడ…..ట అంటూ అఖిల్ సినిమా గురించి ప్రచారం జరుగుతోంది. అఖిల్ రెండో సినిమా బాధ్యత మైత్రీ మూవీస్ సంస్థ చేతికి అప్పగించినట్టు, బడ్జెట్ పెరిగిపోయందన్న కారణంతో మైత్రీ మూవీస్ ఈ సినిమా నుంచి బయటకు వెళ్లిపోయినట్టు వార్తలొస్తున్నాయి. వీటిపై అఖిల్ స్పందించాడు. ఆ వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు.
”మైత్రీ మూవీస్‌తో నేనసలు సినిమానే చేయట్లేదు. అలాంటిది వాళ్లు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం ఏమిటి” అంటూ లాజిక్ తీస్తున్నాడు అఖిల్. వెబ్‌సైట్లో తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఓ వార్త రాసే ముందు నిర్థారించుకొంటే బాగుంటుందని సూచిస్తున్నాడు అఖిల్. నాగార్జునకు ఊపిరిలాంటి హిట్ ఇచ్చిన వంశీపైడిపల్లితో అఖిల్ తదుపరి సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కథపై కసరత్తులు జరుగుతున్నాయి. కథ సిద్ధమయ్యాకే అఖిల్ సినిమాని నిర్మాత ఎవరన్నది స్పష్టం అవుతుంది.