హీరో సాయిధరమ్ తేజ్ ఫస్ట్ మూవీ రేయ్ తప్పించి, ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ మెగా ఫ్యామిలీ హీరోల్లో తనకంటూ ఓ ప్రత్యేక మైన గుర్తింపు తెచ్చుకుంటు ముందుకు సాగిపోతున్నాడు. పిల్లా నీవు లేని జీవితం…సుబ్రహ్మణ్యం ఫర్ సేల్…చిత్రాలను అధిగమించి, తాజా గా దిల్‌రాజు నిర్మాణంలో తెరకెక్కిన సినిమా ‘సుప్రీమ్’. ‘పటాస్’తో సూపర్ హిట్ కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్, మంచి అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఆ అంచనాలను అందుకునే స్థాయిలోనే ఉందా? సమీక్ష లో చూద్దాం..
కథ:
కథ లో హీరో బాలు (సాయిధరమ్ తేజ్), హైద్రాబాద్‌లో ట్యాక్సీ నడుపుకుంటూ తండ్రితో (రాజేంద్ర ప్రసాద్) కలిసి జీవిస్తుంటాడు. అతడి జీవితంలోకి రాజన్ (మైఖేల్ గాంధీ) ఓ ఎనిమిదేళ్ళ బాలుడు వస్తాడు. రాజన్ వచ్చాక బాలు కథ పూర్తిగా మారిపోతుంది.ఇక విషయానికొస్తే అనంతపురం లో తర తరాలుగా జాగృతి ట్రస్ట్ సంస్థ పరిధిలోని వందల ఎకరాలను నమ్ముకొని వేలమంది జీవనం సాగిస్తూ ఉంటారు. ఆ ట్రస్ట్ పరిధిలోని భూములను తన సొంతం చేసుకునేందుకు విక్రమ్ సర్కార్ (కబీర్ దుహన్ సింగ్) ప్లాన్ చేస్తాడు. అయితే ఆ ట్రస్ట్ ఓ రాజ కుటుంబీకులదనీ, వారి వంశం వారు ఇంకా బతికే ఉన్నారని తెలియడంతో విక్రమ్ సర్కార్ ప్లాన్‌కు అడ్డంకి పడుతుంది. తనకి ఎలాంటి సంబంధం లేని జాగృతి ట్రస్ట్ కథలోకి బాలు ఎంట్రీ ఇవ్వాల్సి వస్తుంది.‘నా రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి’ అంటూ బాలుడితో చెప్పించే పాయింట్‌తో అసలు కథ నడుస్తూంటుంది. అసలు బాలుకి, అక్కడి ప్రజలకు సంబంధం ఏంటీ? ఈ రాజన్ అనే బాలుడెవరు? ఆ బాలుడికీ జాగృతి ట్రస్ట్‌కు ఏదైనా సంబంధం ఉందా? ఒక బాధ్యతను తనపై వేసుకున్న బాలు దాన్ని విజయవంతంగా పూర్తి చేశాడా? లాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా.
నటి నటుల పెర్ఫార్మన్స్ :
హీరో సాయిధరమ్ తేజ్ గత చిత్రాలలో లాగే ఎప్పట్లానే మంచి ఎనర్జీ ఉన్న క్యారెక్టర్లో అంతే ఎనర్జీతో నటించి సినిమాను ఓ స్థాయికి తీసుకెళ్ళాడు. డ్యాన్సుల్లో, డైలాగ్ డెలివరీలో సాయిధరమ్ తేజ్ సినిమా సినిమాకూ తన స్థాయిని పెంచుకుంటూ పోతున్నాడు. రాశిఖన్నా ఓ ఫన్ పాత్రలో బాగా నటించింది. చూడటానికి చబ్బి గా, ముద్దుగా వుంది. కథకు చాలా కీలకం అయిన పాత్రలో బాల నటుడు మైఖేల్ గాంధీ అద్భుతమైన ప్రతిభ చూపి ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రిద్వి టీం, ఇక మిగతా నటీనటులంతా సినిమాకు అవసరమైనప్పుడల్లా కామెడీని పండిస్తూ అందరూ తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు.
సాంకేతిక వర్గం పని తీరు :
సాంకేతిక పరంగా చూసుకుంటే వన్ అండ్ ఓన్లీ గా, మొదట దర్శక, రచయిత అనిల్ రావిపూడి గురించి చెప్పుకోవాలి. పటాస్ చిత్రం లో లాగానే ఫుల్ ఎంటర్టైన్మెంట్ కి ప్రాదాన్యత ఇచ్చాడు. అనిల్ ఒక మంచి పాయింట్ చుట్టూ అల్లుకున్న అసలు కథ చాలా పాతదే చిన్నది కూడా, అయితే ఆ చిన్నకథలోనే ఎమోషన్‌ను, ఎంటర్టైన్మెంట్ ను బాగా వాడుకుంటూ ఒక మంచి స్క్రీన్‌ప్లేనే సృష్టించుకున్నాడు. దర్శకుడిగానూ అనిల్ రావిపూడి ఒక కమర్షియల్ సినిమాకు అవసరమైన అంశాలను పొందిగ్గా పేర్చుకున్న విధానం బాగా ఆకట్టుకుంటుంది. డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. హీరో-బాలుడి మధ్యన వచ్చే జర్నీని కథలోని ఎమోషన్‌కు కలపడం ఈ సినిమా విషయంలో దర్శకుడిగా అనిల్ రావిపూడి చూపిన చక్కటి ప్రతిభగా చెప్పుకోవచ్చు. సాయి కార్తీక్ సంగీత దర్శకత్వంలో రూపొందిన పాటలన్నీ సాదాసీదాగానే ఉన్నాయి. ‘ఆంజనేయుడు నీ వాడు’ అనే పాట మాత్రం బాగుంది. ఇక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇచ్చాడు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు టెక్నికల్‌గా ఓ బలంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ఒడిశా నేపథ్యంలో వచ్చే ఓ ఛేజ్ సీన్ సినిమాటోగ్రాఫర్ పనితనానికి ఓ నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎం.ఆర్.వర్మ ఎడిటింగ్ బాగుంది. నిడివి 2.22 బదులు 2 ఘంటలలో అయితే ఇంకా బాగుండేది. ఒక్క ఒడిశా నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో మినహాయిస్తే మేకింగ్ పరంగా పెద్దగా అయ్యింది ఏమి లేదు, సరే… దిల్‌రాజు బ్యానర్ నిర్మాణ విలువలకు వంక పెట్టలేం కదా.
తీర్పు :
ఇప్పుడొస్తున్న కమర్షియల్ సినిమాలకు ప్రధానమైన అంశం ఫన్ ఎలిమెంట్. కథ చిన్నదైనా, అందులో ఉన్న ఎమోషన్ చిన్నదైనా, దానికి కామెడీ టచ్ ఇచ్చి రెండు ఘంటల పాటు ప్రేక్షకుడి ని ఎంటర్ టైన్ చేస్తే మంచి రెస్పాన్స్ వస్తుందనేది ఈమధ్య కాలంలో చాలా సినిమాలే ప్రూవ్ చేసాయి. చిన్న కథే అయినా చెప్పాల్సిన పాయింట్ చుట్టూ అల్లుకున్న ఫన్ ఎలిమెంట్ ఈ సినిమాను నిలబెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. ఈ సినిమాకు ప్రధానమైన హైలెట్ అంటే హీరో పాత్రకు, ఓ బాలుడికి మధ్యన ఉండే జర్నీ గురించే చెప్పుకోవాలి. ‘నా రాజ్యంలో ప్రజలందరూ క్షేమంగా ఉండాలి’ అంటూ బాలుడితో చెప్పించే పాయింట్‌తో అసలు కథ నడుస్తూంటుంది. ఈ పాయింట్ చాలా బాగుంది. హీరో, ఆ బాలుడికి మధ్యన వచ్చే సన్నివేశాలు కూడా బాగా ఆకట్టుకుంటాయి. హీరో, హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ నుంచి పుట్టుకొచ్చే ఫన్, వీరిద్దరి మధ్యన కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఫస్టాఫ్‌ను ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంది. సెకండాఫ్‌లో సింగిల్ పాయింట్లో నడిచే సినిమాకు ఎంటర్టైన్మెంటే ప్రధాన బలం. పృధ్వీ, ప్రభాస్ శీనుల ఎపిసోడ్, రఘుబాబు, వెన్నెల కిషోర్ల నేపథ్యంలో వచ్చే ఎపిసోడ్లు విలన్ రవిశంకర్ క్యారెక్టరైజేషన్ నుంచి పుట్టుకొచ్చే కామెడీ.. ఇలాంటివన్నీ సినిమాను ఎప్పటికప్పుడు ఫన్ ట్రాక్ తప్పకుండా జర్క్‌లు లేకుండా ఒక గ్రాఫ్ లో నడవడం సినిమా పరంగా ప్లస్ పాయింట్స్ అయ్యింది. తాజాగా ఇదే కోవలో వచ్చిన కమర్షియల్ ఎంటర్టైనర్, ‘సుప్రీమ్’. సాయిధరమ్ తేజ్ తనకు బాగా కలిసివచ్చిన ఈ జానర్నే మళ్ళీ నమ్ముకొని ఈసారి కూడా మెప్పించాడనే చెప్పుకోవచ్చు.ఇకపోతే లాజిక్ అంటూ లేకపోవడం, అసలు కథ మొదట్లోనే తెలిసిపోవడం లాంటి ప్రతికూలాంశాలుగా ఉన్నా, ఓ కామెడీమూవీ గా మాత్రం చూస్తే, ఈ సినిమా బాగుంటుంది. చివరాఖరు చెప్పేదేంటంటే ఫుల్ కామెడీతో హాయిగా నవ్వించే సినిమా ‘సుప్రీమ్’!
తెలుగు360.కామ్ రేటింగ్ 3/5
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ,
నటి నటులు : సాయి ధరం తేజ్, రాశి ఖన్నా, రవి కిషన్, రాజేంద్ర ప్రసాద్, కబీర్ దుహన్ సింగ్, సాయి కుమార్, శ్రీనివాస్ రెడ్డి,జయ ప్రకాష్ రెడ్డి,పోసాని , రఘు బాబు,ప్రిద్వి,వెన్నెల కిశోర్, సురేఖ వాణి, సత్యం రాజేష్, ప్రభాస్ శ్రీను, మరియు స్పెషల్ సాంగ్ లో శ్రుతి సోది నటించారు.
సంగీతం : సాయి కార్తీక్,
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీ రామ్ ,
ఎడిటింగ్ : యం ఆర్ వర్మ,
సమర్పణ; దిల్ రాజు
నిర్మాత : శిరీష్ ,
రచన సహకారం : యస్ .కృష్ణ
కథ, స్క్రీన్ ప్లే, మాటలు ,దర్శకత్వం : అనిల్ రావిపూడి,
విడుదల తేది : 05.05.2016