కథానాయికలు గ్లామర్ మంత్రం జపించడం మామూలే! సినీ పరిశ్రమే గ్లామర్‌తో ముడిపడి ఉంది.. అలాంటప్పుడు అందచందాల్ని నమ్ముకోవడంలో తప్పేం లేదు. కాకపోతే.. అది ఎంత వరకూ అన్నది కథానాయికల విచక్షణ మీద, వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో శ్రుతి కాస్త డిఫరెంట్‌గానే ఆలోచిస్తుంది. అవసరమైతే నిండుగా చీర కట్టుకొని, పద్ధతిగా నటిస్తుంది. కావాలనుకొన్నప్పుడు కంటిమీద కునుకు లేకుండా తన అందచందాలతో మతిపోగొట్టే సమర్థురాలు కూడా. ఇప్పుడు ఆ విషయం మరోసారి రుజువైంది.
క్యూ అండ్ క్యూ అనే ఇంగ్లీష్ మ్యాగజైన్ కవర్ పేజీ కోసం శ్రుతి హాట్ హాట్ భంగిమలతో పోజులిచ్చింది. అవి చూస్తే మనమే షాకైపోతాం. మరీ ఇంత రెచ్చిపోవాలా.. అనిపించేలా ఉన్నాయి ఆ భంగిమలు. అందుకోసం శ్రుతి భారీ మొత్తం పారితోషికం అందుకొందట. సాధారణంగా సినిమా అవకాశాలు తగ్గినప్పుడు, మళ్లీ తమ టాలెంట్‌ని బయటపెట్టుకోవడానికి మైగజైన్ల వెంట పడుతూ ఇలా హాట్ పోజులిస్తుంటారు కథానాయికలు. కానీ ఫామ్‌లో ఉండగానే ఇలా మైగజైన్లకు ఇంతటి హాట్ భంగిమల్లో స్టిల్స్ ఇచ్చిందంటే.. శ్రుతిని ఏమనాలి??