వైకాపా ఎమ్మెల్యే యస్వీ మోహన్ రెడ్డి తను తెదేపాలో చేరబోతున్నట్లు కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. తెదేపాలో చేరడానికి ఆయన రేపు ముహూర్తం పెట్టుకొన్నారు. తన అనుచరులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో తెదేపా కండువాలు కప్పుకొంటారు. పార్టీ వీడిన తరువాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకపోయినా, వీడుతున్నపుడు కారణాలు, ఆరోపణలు తప్పవు కనుక ఆయన కూడా జగన్ గురించి ఓ రెండు ముక్కలు చెప్పి కండువా దులిపి పక్కన పడేశారు. ఆయన చెప్పిన కారణాలు: పార్టీలో జరుగుతున్న పరిణామాలు నచ్చలేదు. కర్నూలులో జగన్ దీక్ష గురించి నాకు సమాచారం ఇవ్వలేదు. భూమా నాగిరెడ్డి కుమార్తె అఖిల ప్రియకి బదులుగా మా చిన్నాన యస్వీ నాగిరెడ్డిని నిలబెడదామని చెప్పడం. జగన్ మా పట్ల ఆవిధంగా వ్యవహరించడం చాలా బాధ కలిగించింది. అందుకే పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నా!