తెలంగాణాలో వైకాపాకి ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపి ఉండేవారు. వాళ్ళు అందరూ తెరాసలో చేరిపోయారు. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు వైకాపాను తెరాసలో వీలినం చేసుకొని తమను తెరాస సభ్యులుగా పరిగణించాలని కోరుతూ తెలంగాణా శాసనసభ స్పీకర్ మధుసూధనాచారికి ఒక లేఖ ద్వారా అభ్యర్ధించారు. వారి అభ్యర్ధనను మన్నిస్తూ తక్షణమే వారిని తెరాస సభ్యులుగా గుర్తిస్తున్నట్లు స్పీకర్ ఆమోదముద్ర వేశారు. ఆ విషయాన్ని అధికారికంగా దృవీకరిస్తూ తెలంగాణా శాసనసభ కార్యదర్శి ఒక బులెటిన్ కూడా విడుదల చేసారు.
నిన్ననే తెలంగాణాలో మిగిలిన వైకాపా నేతలు లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యి వైకాపాని తెరాసలో చేర్చుతున్నట్లు వస్తున్న వార్తలను ఖండిస్తూ ఒక తీర్మానాన్ని చేసారు. 24 గంటలు గడవక మునుపే ఈ ప్రకటన్ వెలువడటం విశేషం.