సంచలనం సృష్టిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్ధి దేవి హత్య కేసుపై నటుడు రాం చరణ్ తేజ్ భార్య ఉపాసన కామినేని ఫేస్ బుక్ లో స్పందించారు. దేవి హత్య గురించి ఆమె ఏమన్నారంటే, “మరొక భారతీయ బిడ్డ జీవితం బలైపోయింది కానీ ఇంతవరకు ఆ నిందితుడిపై ఎటువంటి చర్య చేపట్టలేదు. అతను బాగా డబ్బున వ్యక్తి కావడం, ప్రముఖులతో పరిచయాలు కలిగి ఉండటమే అందుకు కారణంగా కనిపిస్తోంది. డబ్బునంత మాత్రాన్న చేసిన నేరానికి శిక్ష పడకుండా తప్పించుకోలేడని నిరూపించేందుకు అందరూ ఈ పోస్ట్ ని షేర్ చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చి అతను ఎంతటి వాడయినా సరే అతనినిపై చర్యలు తీసుకొనే వరకు అందరూ ఈవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తూనే ఉండాలి.” అని మెసేజ్ పెట్టారు.