వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ తెలంగాణా అధ్యక్షుడిగా గట్టు శ్రీకాంత్ రెడ్డిని నియమించారు. ఆయనతో పాటు పార్టీ రాష్ర్ట కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేసారు. ఎ. కృష్ణా రెడ్డి, కె.శివ కుమార్ లను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా, కొండా రాఘవరెడ్డిని పార్టీ అధికార ప్రతినిధిగా, నల్లా సూర్య ప్రకాష్. హెచ్.ఎ. రహమాన్ లను జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు.
తెలంగాణాలో వైకాపా ఒక రాజకీయ పార్టీకి ఉండవలసిన లక్షణాలను ఏనాడూ కనపరచ లేదు. అది ప్రజా సమస్యలపై ఏనాడూ పోరాడిన దాఖలాలు లేవు. కనీసం తన ఉనికి చాటుకొనేందుకు ఎటువంటి ప్రయత్నం చేయదు. అది ఎన్నికలలో పోటీ చేయదు. అధికార పార్టీని విమర్శించదు. వీలయితే సమర్ధిస్తుంది కానీ మిత్రపక్షమని చెప్పుకాదు. దానిని ప్రజలెవ్వరూ పట్టించుకోరు. అది ఎన్నికలలో పోటీ చేయదు. ఇటువంటి లక్షణాలున్న రాజకీయ పార్టీ దేశంలో మరెక్కడా కనబడదేమో? అయినా కూడా జగన్మోహన్ రెడ్డి తెలంగాణాలో తన పార్టీని సజీవంగా ఉంచాలనుకోవడం చాలా విచిత్రంగానే ఉంది.