రామాయణ గాథని దృష్టిలో పెట్టుకొంటే చాలు.. బోలెడన్ని పాత్రలు, వందల కొద్దీ కథలూ తయారు చేసుకోవొచ్చు. ఇతిహాసాల స్ఫూర్తితో అల్లుకొన్న సినిమాలు కమర్షియల్ హిట్స్ గా నిలిచాయి అని చెప్పడానికి తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ నటించిన సుప్రీమ్ సినిమా కథకి కూడా రామాయణమే స్ఫూర్తి అని దర్శకుడు అనిల్ రావిపూడి చెబుతున్నారు. ఇందులో మికెల్ పాత్ర రాముడట.. సాయిధరమ్ హనుమంతుడట.. మిగిలినవాళ్లంతా వానరసైన్యమట..! ఆదివారం హైదరాబాద్లో సుప్రీమ్ సక్సెస్ మీట్ జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ’ ఈ సినిమాను రామాయణం నుండి ఇన్ స్పిరేషన్ గా తీసుకుని చేశాం. రాముడు మికెల్ అయితే, హనుమగా సాయిధరమ్ తేజ్ నటించాడు. మిగిలిన నటీనటులందరూ వానరసైన్యంలా సపోర్ట్ చేశారు. అలాగే ఈ సినిమాలో వర్క్ చేసిన అందరూ ప్రేమతో చేయడం వల్లనే ఇంత పెద్ద సక్సెస్ వీలైంది. ఫిజికల్లీ చాలెంజ్డ్ పర్సన్ తో ఫైట్ చేయాలనే థాట్ వచ్చినప్పుడు ఎంతో ఎమోషన్ ఫీలయ్యాను. అలాగే ఎగ్జయిట్ మెంట్ తో సినిమా చేశాను. రాజేంద్రప్రసాద్ గారు నాకేంతో ఇష్టమైన హీరో. జంధ్యాల, రాజేంద్రప్రసాద్ గారి సినిమాలు చూడకుండా ఉండుంటే నేను నా సినిమాల్లో ఇంత మంచి కామెడిని చేసే చేయగలిగేవాడిని కాను. అలాగే నా వెల్ విషర్ సాయికుమార్ గారు అద్భుతంగా నటించారు. రాశిఖన్నా బెల్లం శ్రీదేవి పాత్రకు ప్రాణం పోసింది. రవికిషన్ గారు ఎంతో కమిట్ మెంట్ తో యాక్సిడెంట్ అయినా ఈ సినిమా చేశారు. సాయిధరమ్ తేజ్ డ్యాన్సులు, ఫైట్స్, పెర్ ఫార్మెన్స్ పరంగా నెక్ట్స్ లెవల్ కు వెళ్లాడని అంటున్నాడు. ఈ సమ్మర్ లో కూల్ ఎంటర్ టైనర్’’ అన్నారు.