మెగా హీరో వరుణ్‌తేజ్ కథానాయకుడిగా మిస్టర్ అనే సినిమా ఈమధ్యే పట్టాలెక్కింది. శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికలుగా లావణ్య త్రిపాఠి, హెబ్బా పటేల్‌లను ఎంచుకొన్నారు. అయితే… హెబ్బాని ఈ సినిమా నుంచి తొలగించారని వార్తలొచ్చాయి. పారితోషికం ఎక్కువ అడుగుతోందని, దాంతో పాటు డేట్లు కూడా అందుబాటులో లేవని, అందుకే హెబ్బాని చిత్రబృందం పక్కన పెట్టిందని గుసగుసలు వినిపించాయి. ఆమె స్థానంలో రెజీనాని ఎంచుకొన్నారన్న ప్రచారమూ జరిగింది.
అయితే ఇవన్నీ రూమర్లేనని చిత్రబృందం తెలిపింది. ”మా బృందంలో ఎలాంటి మార్పుల్లేవు.. కథానాయికని తొలగించారన్న వార్తల్లో నిజం లేదు” అని నిర్మాత తెలిపారు. అంతేకాదు.. అనుకొన్న షెడ్యూల్లోనే ఈ సినిమా మొదలవుతుందని మే 22న షూటింగ్ మొదలవుతుందని చిత్కబృందం తెలిపింది. అంటే మిస్టర్‌లో హెబ్బా స్థానానికి వచ్చిన ముప్పేమీలేదన్నమాట. అయితే ఈ వార్త ఎందుకు పుట్టినట్టు? ఎవరు పుట్టించినట్టు??