రేణూ దేశాయ్.. పవన్ కల్యాణ్‌ని పెళ్లి చేసుకొన్నప్పటి కంటే, విడిపోయిన తరవాత ఎక్కువ ప్రాచూర్యం పొందిన పేరు. ట్విట్లర్లలో ఏదో ఓ వ్యాఖ్య చేస్తూ తరచూ వార్తల్లో ఉంటుంది. ఈసారి డాక్టర్లు, వైద్య వ్యవస్థపై తన నిరసన గళం విప్పింది. దానికి కారణం.. ముద్దుల కొడుకు అకీరానే. అకీరా సైకిల్ తొక్కుతూ పడిపోయాడట. చిన్న చిన్నగాయాలతో బాధపడుతున్న అకీరాని రేణుదేశాయ్ ఓ ఆసుపత్రికి తీసుకెళ్లింది. అయితే.. ఆ అప్లికేషన్లు, ఈ అప్లికేషనూ అంటూ చికిత్స ఆలస్యం చేశారట. చికిత్స చేసేంత వరకూ అకీరా బాధతో విలవిలలాడిపోయాడట.
దాంతో రేణు దేశాయ్ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆసుపత్రి నుంచి తిరిగొచ్చి ట్విట్టర్లో ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ప్రయివేటు ఆసుపత్రికి వెళ్లడం కంటే చచ్చిపోవడం బెటర్ అన్నంత తీవ్ర స్వరంతో.. తన నిరసన గళం విప్పింది. అయితే వెంటనే తేరుకొని, అకీరా ఇప్పుడు బాగానే ఉన్నాడు. చేతికి, మొఖంపై చిన్న చిన్నగాయాలయ్యాయి. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు థ్యాంక్స్ అంటూ ట్వీట్ చేసింది.
https://twitter.com/renuudesai/status/729560579782881281