ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. రాష్ట్ర శాసనసభలో హరీష్ రావత్ (కాంగ్రెస్ పార్టీ) బలపరీక్షకు సిద్దం అవుతుంటే, ఇంతవరకు ఆయనకి మద్దతు పలికిన రేఖ ఆర్య అనే మహిళా కాంగ్రెస్ ఎమ్మెల్యే భాజపా సభ్యులతో కలిసి శాసనసభకు వచ్చేరు. అంటే ఆమె భాజపాకి మద్దతు ఈయబోతున్నట్లు స్పష్టమయింది. అదే సమయంలో బి.ఎస్.పి. అధినేత్రి మాయావతి తమ ఇద్దరు ఎమ్మెల్యేలు హరీష్ రావత్ కే మద్దతు ఇస్తారని ప్రకటించారు. వారితో కలిపి హరీష్ రావత్ కి మొత్తం 29 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లయింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. భాజపాకి ఆర్య రేఖతో కలిపి మొత్తం 29మంది సభ్యులున్నారు. కనుక దానికీ ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరమే. కనుక మిగిలిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు, యుకెడికి చెందిన ఒక్క ఎమ్మెల్యేలు ఎవరికి మద్దతు ఇస్తే వారే ప్రభుత్వం ఏర్పాటు చేయగలుగుతారు. మరి కొద్ది సేపటిలో ఈ హై సస్పెన్స్ డ్రామా ముగియబోతోంది. ఎవరు అధికారంలోకి వస్తారనే విషయం తెలుసుకోవాలంటే మరి కొద్ది సేపు వేచి చూడక తప్పదు.
తాజా సమాచారం: బలపరీక్ష అనంతరం భాజపా నేత గణేష్ జోషి మీడియాతో మాట్లాడుతూ “మా పార్టీ సిద్ధాంతికంగా విజయం సాదించింది కానీ అంకెల గారడీలో ఓడిపోయింది అన్నారు. అంటేహరీష్ రావత్ బలపరీక్షలో నెగ్గినట్లు తెలుస్తోంది.