ఎప్పుడూ కామెడీ చేస్తూ జోకులు వేస్తూ మిమిక్రీ చేస్తూ.. అందర్నీ నవ్వించే వేణుమాధవ్‌కి తొలిసారి కోపం వచ్చింది. తిక్క రేగింది. దాంతో సీరియస్‌గా పోలీస్ స్టేషన్మెట్లెక్కి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదీ.. మీడియా పై. ఈమధ్య వేణుమాధవ్ ఆరోగ్యం గురించి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి. ఆయన సెట్లో కళ్లు తిరిగి పడిపోయారని, ఆయనకు ఏదో అయ్యిందని ప్రచారం సాగింది. ఓ టీవీ ఛానల్ అత్యుత్సాహం కొద్దీ.. వేణుమాధవ్ చనిపోయాడన్న వార్త కూడా ప్రసారం చేసి నాలుక కరచుకొందట. దీనిపై వేణుమాధవ్ ఫైర్ అవుతున్నాడు.
ఈ రోజు ఉదయం కుషాయి గుడ పోలీస్ స్టేషన్లో ఆ టీవీ ఛానల్‌పై, రెండు మూడు వెబ్సైట్లపై ఆయన పిర్యారు చేశారు. ఆయా సంస్థలు ప్రసారం చేసిన వార్తలు తనని తీవ్ర మనస్థాపానికి గురిచేశాయని, ఆ ఛానళ్లు, వెబ్సైట్లపై చర్య తీసుకోవాలని పోలీసుల్ని కోరారు వేణుమాధవ్. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఏదేమైనా సెలబ్రెటీలకు సంబంధించిన వార్తల్ని బ్రేకింగ్ న్యూస్‌ల పేరుతో ప్రసారం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలన్న విషయం ఈ ఉదంతంతో మరోసారి రుజువైంది.