బ్రహ్మోత్సవం విడుదలకు రెడీ అవుతోంది. ఈనెల 20నే సినిమా విడుదల. అట్టే సమయం లేదు. అందుకే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముమ్మయరంగా సాగుతున్నాయి. ఓ వైపు ఎడిటింగ్ వర్క్ జరుగుతోంది.. మరోవైపు మిక్కీ ఆర్ ఆర్ ఇస్తున్నాడు. డీఐ పనులూ చకచక సాగుతున్నాయి. వీటన్నింటికీ పర్యవేక్షిస్తూ కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నాడు మహేష్ బాబు. ఈ సినిమాకి మహేష్ కూడా ఒకానొక నిర్మాణ భాగస్వామి. సాధారణంగా సినిమా అయిపోయాక… ప్రమోషన్లలో తప్పితే మహేష్ పెద్దగా కనిపించడు. అయితే ఈసినిమాకి తానూ ఓ ప్రొడ్యూసర్ కాబట్టి అనుకొన్న టైమ్‌లో సినిమా విడుదల అవుతుందా, లేదా అన్న టెన్షన్ మహేష్‌లో కనిపిస్తోంది.
ఈనెల 16 కల్లా సెన్సార్ పూర్తవ్వాలి. లేదంటే ఓవర్సీస్లో ప్రింట్లు వెళ్లడం కష్టం. అయితే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మాత్రం ఎడిటింగ్ రూమ్‌లోనూ సినిమాని చెక్కుతూ కూర్చుంటున్నాడట. దాంతో మహేష్ కి టెన్షన్ పెరిగిపోతోందని ఫిల్మ్‌నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా విడుదలయ్యేంత వరకూ మహేష్‌కి ఈ టెన్షన్ తప్పేట్టు లేదు.