సినిమావాళ్లంటేనే ‘వాళ్లకు క్రమశిక్షణ ఉండదు’ అన్న అపవాదు ఉంది. కథానాయకులు సెట్లో తమ ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తారని, కొంతమంది చెప్పిన టైమ్ కి రారని, వాళ్లొచ్చినప్పుడే షూటింగ్ పెట్టుకోవాలి.. రూమర్లు వినిపిస్తుంటాయి. సెట్లో పేకాట ఆడేవాళ్లు కొంతమందైతే, మందుకొట్టేవాళ్లు కొంతమంది. ఎక్కువగా కథానాయకుల విషయంలో ఇలాంటి వార్తలు బయటకు వస్తుంటాయి. అయితే ఇప్పుడో హీరోయిన్‌పై ఇలాంటి రూమర్ రావడం దారుణం. కథానాయికగా తనకంటూ ఓ సొంత శైలి, ఇమేజ్ సృష్టించుకొని, కేవలం కథా బలమున్న చిత్రాల్లో నటించే ఓ హీరోయిన్ ప్రవర్తన చాలా అభ్యంతరకరంగా ఉందని, కేవలం ఆమె స్టార్ డమ్‌కి తలొగ్గాల్సివస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాత్రి బాగా తాగి.. అదే మత్తులో ఉదయాన్నే షూటింగ్ వస్తోందని, ఆ హ్యాంగోవర్ సెట్లో చూపిస్తోందని టాక్. ఆమె తెలుగమ్మాయి కాదు. కానీ తెలుగులో పాపులర్ హీరోయిన్. తెలుగు కూడా స్పష్టంగా మాట్లాడుతుంది. కథానాయికని ఏమీ అనలేక.. కక్కలేక మింగలేక దర్శక నిర్మాతలు నానా హైరానా పడిపోతున్నారట. ఇది వరకు వైజాగ్‌లో షూటింగ్ అంటే.. అర్థరాత్రి తాగేసి బీచ్‌లో నానా హంగామా చేసిందట ఈ కథానాయిక. అప్పుడు స్థానిక పోలీసులు ఆమెకు గట్టిగా క్లాస్ పీకారని, అయినా ఆమె తన బుద్ది మార్చుకోలేదని తెలుస్తోంది. కథానాయికలే ఇలా స్వైర విహారం చేస్తోంటే, ఇక హీరోలు తగ్గుతాయా.? యథా హీరోయిన్, తథా హీరో కదా?