మొన్న పంజాబ్ లో పోలీస్ స్టేషన్ పై ముగ్గురు పాక్ ఉగ్రవాదులు దాడి చేసి 8 మందిని చంపగా, నేడు జమ్మూలో ఒక ఉగ్రవాది సరిహద్దు భద్రతా దళాలపై చేసిన దాడిలో ఒక బి.యస్.యఫ్. జవాను మృతి చెందగా మరో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. సరిహద్దు భద్రతా దళాలు జమ్ములో ఉదంపూర్ జిల్లాలో శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న సమయంలో వారి కాన్వాయ్ పై ‘నరసునాలా’ అనే ప్రాంతం వద్ద ఉగ్రవాది దాడి చేసాడు. బి.యస్.యఫ్. జవాన్లు కూడా వెంటనే ఎదురుదాడి చేసి ఆ ఉగ్రవాదిని మట్టుబెట్టారు. ఈ ప్రాంతంలో ఉగ్రవాదుల జాడ కనిపించి చాలా ఏళ్ల యిందని మళ్ళీ చాలా కాలం తరువాత ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో తమ ఉనికిని చాటుకోవడం చాలా ఆందోళన కలిగిస్తోందని జమ్మూ మరియు కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తన ట్వీటర్లో పేర్కొన్నారు.