ఆంధ్ర ప్రదేశ్ రాజధాని నిర్మాణంలో భాగంగా ఒక భారీ ప్రైవేటు సంస్థ నిర్మిస్తున్న ప్రభుత్వ పీఠంలో కార్మికులు మరణిస్తే ఆందోళనలు చేయకుండా అడ్డుకోవడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. గత రెండురోజులుగా వెలగపూడిలోనూ రాజధాని ప్రాంతంలోనూ సాగుతున్న పోలీసు నిర్బంధం, నిషేదాజ్ఞలు, అరెస్టులు కేసులు వంటివి చూస్తుంటే ప్రజాస్వామ్యం ఏమైపోతున్నట్టని సందేహం కలుగుతుంది. ప్రజారాజధాని నిర్మించాలంటే ముందు ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికి ఇద్దరు కార్మికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. విపరీతమైన పనిభారం నిబంధనలు పాటించకుండా పనిగంటలు, పారదర్శకత లేని పెత్తందారీ పోకడలు ఇవన్నీ పనిచేసేవారి ప్రాణాలే హరిస్తున్నాయని వేదన చెందుతున్నా వినే నాథుడు లేడు. ఎపి రాజధాని నిర్మాణంలో ఎక్కడి నుంచో తెచ్చిన యుపి కార్మికులను వినియోగించడంలోనే దురుద్దేశం దాగుంది. వూరూ పేరూ లేనివారైతే ఇష్టానుసారం పనిచేయించుకోవచ్చన్నది మామూలు ఎత్తుగడే కాని ప్రభుత్వ ప్రాంగణంలోనూ అదే జరగడం ఆగ్రహావేదనలు కలిగిస్తుంది. ఇలాటి కాంట్రాక్టు వర్కర్లకు స్థానిక ి ి ప్రపంచంతో పెద్ద సంబంధాలు వుండవు. ఎప్పుడన్నా వెళ్తామన్నా అనుమతి లేదు. అప్పుడప్పుడూ ప్రమాదాలు జరుగుతున్నా స్థానికంగా కొందరు మీడియా వారిని, అంతకు మించి పోలీసులను లోబర్చుకుని బయిటకు రాకుండా చేస్తున్నారు. రాజకీయ రియల్ మాఫియాలు ఎలానూ వున్నాయి. మంగళవారం నాడు దేవేందర్ మృతి ఘటన తర్వాత ఆ ప్రాంతాన్ని అభేద్య పోలీసు దుర్గంగా మార్చేశారని ఇంగ్లీషు పత్రికలు కూడా రాశాయి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో సహా అనేక మందిని అరెస్టు చేసి కేసుల చిట్టా తగిలించారు. కేసులు పెట్టాల్సింది నిబంధనలు ఉల్లంఘించిన వారిపైనా న్యాయం కోసం నిరసన తెలిపే వారిపైనా? ఇదేగాక అక్కడ ప్రైవేటు నిర్మాణాలలో కూడా బయిటి కార్మికులనే వాడుతున్నారు. వారు ఏ మాత్రం మాట్లాడినా వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి బెదిరిస్తారు. కార్మిక నేతల ప్రవేశాన్ని అడ్గుకుని అరెస్టులు చేస్తారు. ఆంక్షలు పెడతారు. ఇదంతా ఒక విషవయలయంగా మారిపోతున్నది. ఆందోళనల తర్వాత మృతుడైనకార్మికుడి కుటుంబానికి 20 లక్షలు పరిహారం ఇచ్చేందుకు ఒప్పుకున్నారుగాని అంతకు ముందు మరణించిన వారి మృతదేహాలను గప్చిప్గానే తరలించేశారు. నిజానికి వీటిని ప్రమాద మరణాలుగా చెబుతున్నా అహౌరాత్రాలు పనిచేయించడం వల్ల అలసి పోయి అసహాయంగా మరణానికి చేరువవుతున్న పరిస్థితి.భారీ వ్యయంతో జరుగుతున్న సచివాలయం వంటి కీలక నిర్మాణంలో ఈ దారుణ పరిస్థితి సిగ్గుచేటు. . మొన్న ఒక సూపర్ స్టార్ రియల్ వెంచర్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వచ్చారని వార్త చూశాం. వాస్తవానికి ఇప్పటికే నిర్మాణం సాగిస్తున్న మరో రియల్ వెంచర్ యాజమాన్యం కార్మికులపై పోలీసులను పురికొల్పడానికి ఈ స్టార్ పేరే వాడుకుంటున్నట్టు ఆధారాలున్నాయి. .కంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక పోలీసు శాఖల కనుసన్నల్లో ఇదంతా జరగడం కొందరు ప్రజా ప్రతినిధులు సినిమా స్టార్లు వాణిజ్యవేత్తలు కూడా చేతులు వేస్తుండడం మరింత ఘోరం