టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ నిర్మాత ఎవరంటే దిల్‌రాజు పేరు చెబుతారు. ఆయన ప్లానింగ్ పర్ఫెక్ట్ అని కితాబిస్తారు. పోస్టర్ని చూసి..సినిమా రిజల్ట్ పసిగట్టేస్తారని.. ఆయన గురించి గొప్పగా చెబుతారు. అలాంటి దిల్‌రాజుకీ ఆ మధ్య ఫ్లాప్స్ తగిలాయి. ముఖ్యంగా రామయ్యా వస్తావయ్యా, కృష్ణాష్టమి బాగా నిరాశ పరిచాయి. పంపిణీ చేసిన సినిమాలూ… బక్కెట్ తన్నేశాయి. వీటిపై దిల్‌రాజు స్పందించాడు. ”ఆ సినిమా ఫ్లాప్ అయ్యిందంటే దానికి కారణం దర్శకుడో, హీరోనో కాదు. నేనే. నా సినిమా ఫ్లాప్స్‌ని నేనే బాధ్యత తీసుకొంటా. కథని నమ్మి ప్రయాణం సాగించేవాడ్ని. కొన్నికొన్నిసార్లు మనం అనుకొన్నవి జరగవు. అన్నీ అనుకొన్నట్టు జరగడానికి నేనేం దేవుడ్ని కాదు కదా.. నిమిత్తమాత్రుడ్ని. అందుకే నాకూ పరాజయాలు తగిలాయి” అంటున్నాడు దిల్‌రాజు.
ఈమద్య ఎక్కువగా కమర్షియల్ కథలవైపు మొగ్గుచూపుతున్న దిల్‌రాజుకి సీతమ్మవాకిట్లో లాంటి సినిమా మరోటి తీయాలని ఉందట. తన సంస్థ గౌరవాన్ని పెంచిన చిత్రాల్లో బొమ్మరిల్లు, సీతమ్మ వాకిట్లో, కొత్త బంగారులోకం లాంటి చిత్రాలున్నాయని, మళ్లీ అలాంటి కథల్ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నానని దిల్‌రాజు చెబుతున్నాడు.