చిన్న సినిమా అంటే అందరికీ చిన్న చూపే. కంటెంట్ బాగుంటేనే థియేటర్లకు వస్తారు. లేదంటే లేదంతే! ఓ మల్లి విషయంలోనూ అదే జరిగింది. రమ్యశ్రీ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం ఓ మల్లి. ఆమధ్య నైజాంలో తప్ప మిగిలిన చోట్ల విడుదలైంది. సినిమాని ఎవ్వరూ పట్టించుకోలేదు. అందుకే వెంటనే యూ ట్యూబ్‌లో పెట్టేశారు. అయితే… నెట్ ప్రపంచంలో మాత్రం ఈ సినిమా దూసుకుపోతోంది. ఇప్పటి వరకూ ఈ చిత్రాన్ని యూట్ ట్యూబ్‌లో ఏకంగా 25 లక్షలమంది వీక్షించారు. కేవలం ఏడు రోజుల్లో ఇంతమంది చూడడం, అదీ ఓ చిన్న సినిమా, అందులోనూ పబ్లిసిటీ కోసం పైసా కూడా ఖర్చు పెట్టని సినిమా ఈ స్థాయిలో హిట్స్ దక్కించుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పెద్ద సినిమాల స్థాయిలో యూ ట్యూబ్ హిట్స్ దక్కించుకోవడం వెనుక ఓ మల్లి పోస్టర్లు కీలక పాత్ర పోషించాయి. పోస్టర్లలో ఎద అందాల్ని బహిర్గతం చేస్తూ.. రమ్యశ్రీ అందాల్ని ఆరబోసింది. సినిమాలోనూ అవే కనిపిస్తాయని నెటిజన్లు భావించడం వల్ల.. ఈ సినిమాకి హిట్స్ మీద హిట్స్ పడ్డాయి. దాంతో పాటు సినిమా కూడా మరీ అంత బ్యాడ్‌గా లేదు.. మంచి ప్రయత్నంగానే పేరు తెచ్చుకొంది. సో.. యూ ట్యూబ్‌లో ఈ శృంగార చిత్రం… హల్ చల్ చేస్తోంది. త్వరలోనే కోటి హిట్స్‌కి చేరిపోతే ఆశ్చర్యపోనవసరం లేదేమో?