ఏ స్టార్ కెరీర్ కైనా సరే.. ‘మీడియాతో సంబంధాలు’ అన్నది చాలా కీలకం. మహేష్ బాబులానో, పవన్ కల్యాణ్లానో మీడియాతో అంటీఅంటనట్టు వ్యవహరించడం ఓ పద్ధతి. లేదంటే అఖిల్లానో, రానాలానో మీడియాని ఎప్పుడూ పెనవేసుకుపోవడం మరో పద్ధతి. అల్లు అర్జున్ అయితే.. ఈ రెండింటికీ దూరంగా, భిన్నంగా ప్రవర్తిస్తున్నాడేమో అనిపిస్తోంది. బన్నీకి తెలుగు మీడియా అంటే పెద్దగా గౌరవం లేదేమో.. అన్న సందేహాలు కలుగుతున్నాయి. సరైనోడు విడుదలైనప్పుడు తమిళనాడు, కేరళ వెళ్లి ప్రచారం చేసొచ్చాడు.అక్కడ మీడియాకు పర్సనల్ ఇంటర్వ్యూలు ఇచ్చాడు. కానీ.. తెలుగు మీడియాని మాత్రం మర్చిపోయాడు. విడుదలైన రెండు వారాల తరవాత, అదీ.. వసూళ్లు బాగా తగ్గిపోయాయని తెలిశాక.. ప్రధాన పత్రికలకు పిలిచి ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అందులోనూ సమీక్షలు రాసేవాళ్లపై సెటైర్లు వేశాడు. అసలు ఇక్కడివాళ్లకు సినిమా చూడ్డమే రాదు అని ఓ స్టేట్ మెంట్ పడేశాడు. సరైనోడుకి ఎవ్వరూ పెద్దగా పాజిటీవ్ రివ్యూలు ఇవ్వలేదు. అదీ మనోడి కోపం. మరి… రేసుగుర్రం సినిమాని ఆహా ఓహో అని పొగిడినప్పుడు బన్నీ ఏమైపోయాడు. అప్పుడు సమీక్షలు రాసేవాళ్లకు సినిమాలు చూడడం వచ్చా??? రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి పాత్రకు క్రెడిట్ మొత్తం ఇచ్చినప్పుడు రివ్యూవాళ్లు మంచోళ్లా?? అంటే.. పొగిడితే ఒకలా, తిడితే మరోలానా?? ఇదెక్కడి న్యాయం బన్నీ. అది చాలదన్నట్టు పవన్ ఫ్యాన్స్‌ని తిక్కరేగేలా స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఇదే పని.. సరైనోడు విడులకు ముందు చేసుంటే… పవన్ ఫ్యాన్స్ ఎదురుదాడి మరోలా ఉండేది. బన్నీ కాస్త కంట్రోల్లో ఉంటే మంచిదని పవన్ ఫ్యాన్సే తెగేసి చెబుతున్నారు. మరి బన్నీ ఏం చేస్తాడో??