అర్థం చేసుకొనే అర్థాంగి తోడుంటే… ఆ మగాడి బతుకు పండగే! మహేష్ బాబు సక్సెస్‌ల వెనుక నమ్రత హస్తం, ప్రోత్సాహం కూడా ఉన్నాయన్నది కాదనలేని సత్యం. ఇది వరకు మహేష్ మీడియాతో పెద్దగా టచ్‌లో ఉండేవాడు కాదు. సినిమా విడుదలైన తరవాత ఏదో నిర్మాతల బలవంతం కొద్దీ మాట్లాడేవాడంతే. ఇప్పుడు పంథా మారింది. సినిమా ప్రమోషన్లలో విరివిగా పాల్గొంటున్నాడు. పత్రికలకు, ఛానళ్లకు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. బ్రహ్మోత్సవం సమయంలో ఏకంగా మహేష్ 31 ఇంటర్వ్యూలకు అటెండ్ అయ్యాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవం సినిమాకీ అంతే. ఇంటర్వ్యూలమీద ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు మహేష్. ఈ మార్పుకి కారణం.. నమ్రత అని తెలుస్తోంది.
నమ్రత ఇప్పుడు మహేష్ పీఆర్వోగానూ వ్యవహరిస్తోందని, మహేష్వ్యక్తిగత విషయాలే కాకుండా, మీడియా సంబంధించిన ఇష్యూస్ కూడా తనే టేకప్ చేస్తోందని టాక్. ఎవరెవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఏ టైమ్‌లో ఇవ్వాలి? అన్నది నమ్రతనే డిసైడ్ చేస్తోందని తెలుస్తోంది. అసలు బ్రహ్మోత్సవం పబ్లిసిటీ షెడ్యూల్ అంతా డిజైన్ చేసింది ఆమే అని తెలుస్తోంది. ఎవరికి ఇంటర్వ్యూ కావాలన్నా నమ్రత మేమ్ పర్మిషన్ తీసుకోవాల్సిందేనట. ఇంగ్లీష్ డైలీస్లలో, కొన్ని వెబ్ సైట్లలలో మహేష్‌కీ, బ్రహ్మోత్సవం సినిమాకి పాజిటీవ్ న్యూస్‌లు రావడానికి నమ్రత తెగ కష్టపడుతోందని టాక్.