ప్రముఖ నటుడు, నిర్మాత రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ని ఆదివారం రాత్రి కేర్ ఆసుపత్రిలో చేర్పించారు. గత కొన్ని రోజులుగా శ్వాస కోస సంబంధతమైన సమస్యతో కృష్ణంరాజు బాధపడుతున్నారని వినికిడి. ఆదివారం ఇంకాస్త ఇబ్బందిపెట్టడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈరోజు ఉదయం ప్రభాస్ కూడా పెదనాన్నని పలకరించి వచ్చాడు. ప్రస్తుతం రెబల్ స్టార్ ఆరోగ్యం కుదుటగానే ఉందని, రేపు ఆయన్ని డిశ్చార్జ్ చేస్తారని తెలుస్తోంది.