ఇవ్వాళ్ళ సాయంత్రం కేరళ, తమిళనాడు, పుదుచ్చేరిలలో పోలింగ్ ముగియడంతో వివిధ వార్తా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలను ప్రకటించాయి. అవి ప్రకటించిన సంఖ్యలలో కొద్దిపాటి తేడాలున్నప్పటికీ దాదాపు అన్ని సంస్థలు ఒకే రకమయిన ఫలితాలను ఊహించడం విశేషం. ఇండియా టుడే, ఎ.బి.పి. న్యూస్, ద టైమ్స్ నౌ, సి.ఓటర్, ఇండియా టీవి సంస్థలు వెల్లడించిన ఫలితాల ప్రకారం అసోంలో భాజపా, పశ్చిమ బెంగాల్ లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె పార్టీ, కేరళలో వామ పక్షాల ఎల్.డి.ఎఫ్. కూటమి, పుదుచ్చేరిలో కాంగ్రెస్ కూటమి విజయం సాధించి అధికారం కైవసం చేసుకోబోతున్నాయని ఫలితాలు తెలియజేస్తున్నాయి.
ఇప్పుడు రాష్ట్రాల వారిగా అవి వెల్లడించిన ఫలితాలు ఏవిధంగా ఉన్నాయంటే: