ఒకరు టాలీవుడ్ సూపర్ స్టార్, ఇంకొకరు పవర్ఫుల్ పవర్ స్టార్. మహేష్ బాబు.. పవన్ కల్యాణ్.. తెలుగు చిత్రసీమలో నెంబర్ వన్ హీరోలుగా చలామణీ అవుతున్నారు. స్టార్ డమ్‌లో, అభిమాన గణంలో, పారితోషికంలో ఇద్దర్నీ కొట్టేవాడే లేడు. అయితే డాన్స్ విషయంలో మాత్రం వీరిద్దరూ ఒకరికి ఫిదా అయిపోయారు. ఆ ఒక్కడూ… ఎన్టీఆర్. తన అద్భుతమైన డాన్సింగ్ టాలెంట్‌తో టాలీవుడ్‌ని షేక్ చేస్తున్న ఎన్టీఆర్ ఇప్పుడు మహేష్, పవన్‌ల అభిమానాన్ని చొరగొన్నాడు. మొన్నామధ్య పవన్ ‘ఎన్టీఆర్‌లా డాన్సులు చేయలేను’ అని ఎన్టీఆర్ డాన్సింగ్ టాలెంట్‌కి కితాబిచ్చాడు.
ఇప్పుడు మహేష్ బాబుదీ అదే మాట. టాలీవుడ్లో గొప్ప డాన్సర్ ఎన్టీఆరే అంటూ కితాబిచ్చాడు మహేష్. దాంతో బుడ్డోడి ఫ్యాన్స్ పండగ చేసుకొంటున్నారు. ఎన్టీఆర్ డాన్సులు అదరహో.. అని ఒప్పుకోవడం పవన్, మహేష్‌ల నమ్రతకు నిదర్శనం. సాటి హీరో గొప్పదనాన్ని ఒప్పుకోవడానికి సైతం గట్స్ ఉండాలి. ఆ విషయంలో పవన్, మహేష్.. ఇద్దరూ తమకు తాము సాటి అని నిరూపించుకొన్నారు. టాలీవుడ్లో హీరోల మధ్య స్నేహపూర్వక వాతావరణానికి ఇలాంటి స్టేట్మెంట్లే నాంది కావాలి.