మరో మెగా ఫంక్షన్ కి సమయం దగ్గర పడుతోంది. రేపు (బుధవారం) హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఒక మనసు.. ఆడియో విడుదల కానుంది. మెగా కథానాయికగా నిహారిక డెబ్యూ మూవీ ఇది. మెగా హీరోలు రామ్‌చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, అల్లు శిరీష్ హాజరవుతున్నారు. చిరంజీవి కూడా వస్తే రావొచ్చని ప్రచారం జరుగుతోంది. పవన్ ఎలాగూ ఇలాంటి ఫంక్షన్లకు దూరంగా ఉంటాడు. అయితే ఇప్పుడు బన్నీ కూడా ఈ పోగ్రామ్‌కి డుమ్మా కొట్టాలనిచూస్తున్నట్టు టాక్.
ఎందుకంటే ఇటీవల పవన్ కల్యాణ్ గురించి మాట్లాడమని అభిమానులు బలవంతం చేస్తే.. ‘మాట్లాడను బ్రదర్’ అని చెప్పి, పవన్ ఫ్యాన్స్‌ని కెలికాడు. ఆ ఒక్క వ్యాఖ్య చుట్టూ పెద్ద దుమారం రేగుతోంది. రేపు ఆడియో ఫంక్షన్లోనూ పవన్ఫ్యాన్స్నుంచి ఇబ్బంది తప్పదని బన్ని భావిస్తున్నాడట. రేపు వేదికపై మైకు పట్టుకొన్నప్పుడు కూడా పవన్ ఫ్యాన్స్ గొడవ చేస్తారని బన్నీకి తెలుసు. అప్పుడు కూడా మాట్లాడకపోతే.. పవన్ ఫ్యాన్స్‌కి మరింత దూరమైనట్టు ఉంటుంది. మాట్లాడితే ‘మాట్లాడను బ్రదర్’ అనే వివాదంపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకొచ్చిన గొడవలే అని ఈ ఫంక్షన్‌కి డుమ్మా కొట్టడమే బెటర్ అని బన్నీ భావిస్తున్నాడని ఇన్ సైడ్ టాక్. ఒకవేళ ఫంక్షన్‌కి బన్నీ హాజరైతే, పవన్ గురించి పాజిటీవ్ గా మాట్లాడి, పవన్ ఫ్యాన్స్‌ని బన్నీ కూల్ చేస్తాడని చెప్పుకొంటున్నారు. సో.. అందరి కళ్లూ… రేపటి ఒక మనసు పాటల వేడుకమీదే.