యువ కథానాయకుడు తనీష్ తండ్రి వర్ధన్ ఈ రోజు ఉదయం అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కన్నుమూశారు. మణికొండలోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వర్ధన్ .. అదే అపార్ట్మెంట్లోని 6వ ఫ్లోర్ నుంచి మంగళవారం అర్థరాత్రి ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డారు. కుటంబ సభ్యులు ఆసుపత్రికి చేర్పించినా ఫలితం లేకపోయింది. అయితే ఈ మరణం ఇప్పుడు మిస్టరీగా మారింది. వర్థన్ ప్రమాదవశాత్తూ జారి పడ్డారా, లేదంటే ఆత్మహత్య చేసుకొన్నారా, లేదంటే ఎవరైనా తోసేశారా, అనే కోణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తనీష్ అపార్ట్మెంట్లో లేడని తెలుస్తోంది.
వర్థన్ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నార్ట. కొడుకు తనీష్ తో కూడా ఆయనకు గొడవలు ఉన్నాయట. అందుకే తనీష్ అదే అపార్ట్మెంట్లో వేరుగా ఉంటున్నాడని తెలుస్తోంది. కుటుంబ సభ్యులు మాత్రం ఇది ప్రమాదవశాత్తూ జరిగిన ఘటన అని చెబుతున్నారు. ప్రస్తుతం రాయదుర్గం పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా తనీష్ తన తండ్రి మరణంతో కృంగిపోయాడు. అసలే సినిమాల్లేని తనీష్‌కు ఇది పెద్ద దెబ్బే.