‘చెప్పను బ్రదర్’ అని పవన్‌పై బన్నీచేసిన కామెంట్ ఇండ్రస్ట్రీలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క ముక్క పట్టుకొని బన్నీపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ‘అలా ఎందుకు అన్నాన్రా బాబూ..’ అంటూ బన్నీ కూడ తల పట్టుకొనికూర్చున్నాడు. ఈరోజు మరి కొద్దిసేపట్లో జరగబోతున్న ఒక మనసు ఆడియో ఫంక్షన్లో బన్నీ పాల్గొనబోతున్నాడు. ఈ వేడుకలో బన్నీ, పవన్‌పై చెలరేగిన వివాదానికి పుల్ స్టాప్ పెట్టే యోచనలో ఉన్నాడని విశ్వసనీయ వర్గాల సమచారం. పవన్ అంటే తనకు ఎంతిష్టమో.. ఈరోజు అభిమానుల సమక్షంలో గొంతు విప్పనున్నాడని తెలుస్తోంది.
నిజానికి ఈ ఫంక్షన్‌కి బన్నీకి ఆహ్వానం అందినా.. డుమ్మా కొడదామనుకొన్నాడు. ఒకవేళ ఫంక్షన్‌కి రాకపోతే, తనపై మరిన్ని విమర్శలు, అనుమానాలు దాడి చేస్తాయని బన్నీ భయపడి ఉంటాడు. అందుకే సడన్‌గా పోగ్రాం మార్చి ఆడియో ఫంక్షన్‌కి వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అంతేకాదు.. పవన్‌పై తాను చేసిన కామెంట్ల విషయంలో క్లారిటీ ఇచ్చేస్తే, ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టినట్టు ఉంటుందని బన్నీ భావిస్తున్నాడట.