మనలో మనకు గొడవలొద్దు.. మీరు గ్రూపులుగా విడిపోవొద్దు. మేమంతా ఒక్కటే అని ఒక మనసు ఆడియో ఫంక్షన్లో బన్నీ అంత క్లారిటీగా అంత ప్రశాంతంగా, అంత వినయంగా మాట్లాడుతున్న వేళ.. బన్నీ ఎదురుగానే ఫ్యాన్స్ మధ్య కొట్లాల మొదలైంది. దాంతో మెగా ఫ్యాన్స్ ఎంత అడ్డంగా చీలిపోయారు అన్నదానికి మరో నిదర్శనం దొరికింది. బన్నీ స్పీచ్ అందుకోగానే.. కొంతమంది అభిమానులు పవర్ స్టార్.. పవర్ స్టార్ అంటూ గోల చేశారు. బన్నీ ఎంత వారిస్తున్నా, ఆ గోల సర్దుమణగలేదు. అయినా సరే, ఇవేం పట్టించుకోకుండా బన్నీ తన స్పీచ్‌లోకి వెళ్లిపోయాడు. అయితే కొంతమంది ఫ్యాన్స్… బన్నీ మాటలకు అడ్డు పడ్డుతూ అరవడం మొదలెట్టారు. దాంతో చుట్టు పక్కల ఉన్న బన్నీ అభిమానులు వాళ్లతో గొడవకు దిగారు. అక్కడకు వచ్చిన ఫ్యాన్స్రెండుగా చీలిపోయి.. ఒకరినొకరు నిందించుకోవడం మొదలెట్టారు.
దాంతో ఆడియో ఫంక్షన్లో కాసేపు కలకలం రేగింది. బౌన్సర్స్ వచ్చి కొంతమంది ఫ్యాన్స్‌ని బయటకు లాగేయడంతో ఈ రాద్దాంతం సద్దుమణిగింది. ఈ ఆడియో ఫంక్షన్‌ని అభిమానుల సమీకరణం పెద్ద ఎత్తున సాగింది. కొంతమంది పవన్ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కావాలనే ఈ ఫంక్షన్‌కి వచ్చారు. బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగానే ఈ వేడుకలో కనిపించారు. ఇది వరకు మెగా ఫ్యాన్స్ అంతా ఒకటిగానే ఉండేవారు. ఇప్పుడు వాళ్లలో కుమ్ములాటలు చూసి.. మెగా హీరోలంతా తలలు పట్టుకొంటున్నారు. మరి మెగా ఫ్యాన్స్‌లో మార్పు వచ్చేదెలా..?? వాళ్లని కలసికట్టుగా చూసేదెలా?? మాలో మాకు ఏం లేవు… మేమంతా ఒక్కటే అని అరచి గోల పెడుతున్నా ఈ గ్రూపిజం ఇంకెనాళ్లూ..?