కాంగ్రెస్ పార్టీ గత 15ఏళ్లుగా పాలిస్తున్న అసోం రాష్ట్రాన్ని చేజార్చుకొంది కానీ ఊహించని విధంగా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మొత్తం 30 సీట్లలో 17 దక్కించుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కనుక పుదుచ్చేరిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. ముఖ్యమంత్రి రంగస్వామి నేతృత్వంలో అధికార ఏ.ఐ.ఎన్.ఆర్.సి.పార్టీ ఈ ఎన్నికలలో కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అన్నాడిఎంకె పార్టీ-4, ఇతరులు ఒక సీటు గెలుచుకొన్నారు.