నేను శైలజతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు రామ్. వరుస ఫ్లాపుల తరవాత వచ్చిన విజయం కావడం వల్లో, పరాజయాల లోతు తెలుసుకొన్నందుకో ఈసారి మరింత జాగ్రత్తగా అడుగులు వేయాలని నిర్ణయించుకొన్నాడు. ఈ నేపథ్యంలతో కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కథకు ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. కథ రెడీ అయ్యింది. షూటింగ్ కూడా లాంఛనంగా మొదలైంది. అయితే కథానాయిక విషయంలో రామ్ ఇంకా ఓ క్లారిటీకి రాలేకపోతున్నాడని సమాచారం. ముందుగా ఈసినిమాలో కథానాయికగా తమన్నాని అనుకొన్నారు. తమన్నా భారీ పారితోషికం డిమాండ్ చేస్తుండడంతో రాశీఖన్నాని తీసుకొన్నాడు. ఇప్పుడు మళ్లీ కథానాయిక మారింది. రాశీఖన్నా స్థానంలో రకుల్ ప్రీత్‌సింగ్‌ని ఎంచుకొన్నారని సమాచారం.
పండగ చేస్కోలో రామ్, రకుల్ జోడీగా నటించారు. ఆ సినిమా ఓకే అనిపించుకొంది. అందుకే… రాశీఖన్నాకు బదులుగా రకుల్‌ని తీసుకొన్నట్టు తెలుస్తోంది. పైగా రాశీతో పోలిస్తే, రకుల్‌కే కాస్త క్రేజ్ ఉంది. అందుకే పారితోషికం కాస్త ఎక్కువైనా రకుల్ వైపే మొగ్గు చూపుతోంది చిత్రబృందం. ప్రస్తుతం మెగా హీరో సాయిధరమ్‌తో కలసి ఓ సినిమాలో నటిస్తోంది రకుల్. రామ్ సినిమాతో తను మరింత బిజీ అయిపోతుంది.