బ్రహ్మోత్సవం సెటైర్ల సుడిగాలిలో చిక్కుకొంది. బోరోత్సవం, నిరుత్సాహం, నీరసం అంటూ గ్యాగ్ లైన్ పెడుతున్నారు. అయితే… ఈ సినిమా వల్ల మహేష్ బాబు బాగానే లాభపడ్డాడు. రెమ్యునరేషన్ కింద రూ.18 కోట్లు, లాభం కింద మరో రూ.7 కోట్లు వెరసి.. మొత్తానికి ఈ సినిమా ద్వారా పాతిక కోట్లు రాబట్టుకొన్నాడు. మహేష్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ‘లావాదేవీల మాట మీరు చూసుకోండి.. ఈ సినిమాతో నికరంగా నాకు ఎంత ఇవ్వాలో అంత ఇవ్వండి’ అంటూ ఈసినిమా బిజినెస్ అవ్వకముందే ఆఫర్ ఇచ్చాడట. అలా.. ఈసినిమాతో మహేష్ పాతిక కోట్లు జేబులో వెసుకొన్నాడని టాక్.
శ్రీమంతుడు సినిమాకీ మహేష్ ఇదే థీరీ ఫాలో అయ్యాడు. అయితే.. అక్కడ లాభాలు ఓ రేంజులో వచ్చాయి. పారితోషికం రూ.16 కోట్లు లాభాలు 9 కోట్లు చేజిక్కించుకొన్నాడు. ఒకవేళ కేవలం పారితోషికం పై ఆధారపడితే మహేష్ రూ.16కోట్లు కంటే ఎక్కువ సంపాదించలేడు. అందుకే… నిర్మాతగానూ భారం మోస్తున్నాడు. అందుకే సినిమాకి పాతిక చొప్పున గిట్టుబాటు అవుతోంది. మహేష్ మంచి స్టెప్పే వేశాడు.