ఓ సినిమా హిట్టయితే క్రెడిట్ ఎంతుస్తుందో తెలీదు గానీ, ఫ్లాప్ అయితే మాత్రం ఆ భారాన్ని కాస్త ఎక్కువగానే మోయాలి కథానాయికలు. తాజాగా బ్రహ్మోత్సవంలోనూ అదే జరుగుతోంది. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలున్నారు. ప్రణీత చేసిందేం లేదు. కాజల్ ఓకే అనిపించింది. సమంత క్యారెక్టర్ బాగానే ఉన్నా.. గ్లామర్ పరంగా ఆమెకు మైనస్ మార్కులు పడ్డాయి. సమంతేంటి? అలా తయారైపోయింది? అంటూ నిట్టూరుస్తున్నారు ఆమె అభిమానులు. ఫేస్ బుక్, ట్విట్టర్లో అయితే.. సమంతపై బోలెడన్ని జోకులు బయల్దేరాయి. సమంత కి వడదెబ్బ తగిలిందని కొందరు, పీక్కుపోయిన పిట్టలా ఉందని మరికొందరు కామెంట్లు విసురుకొంటున్నారు.
సమంతకు తన లుక్‌పై దృష్టిపెట్టాల్సిన అవసరం వచ్చింది. ఇది వరటి గ్లామర్ సమంతలో లేదన్నది వాస్తవం. ఆమధ్య ఎక్సర్సైజులు చేసి బరువు తగ్గే ప్రయత్నం చేసింది సమంత. ఆ ఎఫెక్ట్ ఆమె గ్లామర్‌పై పడింది. బరువు ఏమాత్రం తగ్గిందో తెలీదుగానీ.. మొహం పీక్కుపోయంది. తనపై వచ్చిన విమర్శల్ని సమంత కూడా ఓ కంట కనిపెడుతూనే ఉంది. తన తదుపరి సినిమా అ.ఆలోనూ ఇలాంటి టాకే వస్తే తన భవిష్యత్తేంటి అని సమంత బెంగ పెట్టుకొన్నట్టు తెలుస్తోంది. లుక్ మార్చడానికి, తదుపరి సినిమాలో కొత్తగా కనిపించడానికి సమంత ఏదోటి చేయాలి.. లేదంటే సమంత మరింత గడ్డు పరిస్థితిని ఎదుర్కోక తప్పదు.