బ్రహ్మోత్సవం వల్ల ఎంతమంది ఎన్నిరకాలుగా నష్టపోయినా సేఫ్ అయ్యింది ఒకే ఒక్కడు… మహేష్‌బాబు. ఈ చిత్ర నిర్మాణంలో మహేష్ వాటా కూడా ఉన్న సంగతి తెలిసిందే. పారితోషికంతో పాటు.. లాభాల్లో వాటా తీసుకొంటా అని మహేష్ ఎగ్రిమెంట్ చేసుకొన్నాడు. పారితోషికం కింద కొంత క్యాష్ తీసుకొన్న మహేష్.. సినిమా విడుదలకు ముందే నిర్మాత పీవీపీతో సెటిల్మెంట్కు దిగాడు. లాభాల్లో నాకు వాటా వొద్దు. నికరంగా ఎంతిస్తారో ఇచ్చేయండి అని బేరం పెట్టాడు. అప్పటికీ పీవీపీకి ఈసినిమాపై నమ్మకం చావలేదేమో? మహేష్‌కి అదనంగా మరో రూ.8 కోట్లు ఇచ్చి సెటిల్ చేసుకొన్నారు. అలా ఈ సినిమా ఫలితం తేకముందే.. గట్టెక్కేశాడు మహేష్.
శ్రీమంతుడికీ ఇలానే లాభాల్లో వాటా అంటూ ఎగ్రిమెంట్ రాయించుకొన్న మహేష్.. సినిమా విడుదలయ్యేంత వరకూ ఓపిక పట్టాడు. ఆ సినిమా బ్లాక్ బ్లాస్టర్ అవ్వడంతో మహేష్‌కి లాభాలు భారీగానే వచ్చాయి. అందుకే.. మహేష్ కొరటాలకు ఓ ఖరీదైన కారుని కూడా గిఫ్టుగా ఇచ్చాడు. అంటే శ్రీమంతుడు హిట్టవుతుందని, బ్రహ్మోత్సవం సినిమా ఫ్లాప్ అవుతుందని మహేష్‌కి ముందుగానే తెలుసన్నమాట. అందుకే.. మెల్లిగా జారుకొని ఆ నష్టాల్ని పీవీపీ నెత్తిమీదకే రుద్దేశాడు. ఈ విషయంలో మహేష్ తెలివే తెలివి కదూ.