బ్రహ్మోత్సవం పనుల్లో క్షణం తీరిక లేకుండా గడిపాడు మహేష్ బాబు. ఆసినిమాకి నిర్మాత కూడా తనే కావడంతో, పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ దగ్గరుండి చూసుకొన్నాడు. విడుదలకు ముందు ఇంటర్వ్యూలతో బిజీ బిజీగా గడిపాడు. అడిగిన వాళ్లకీ, అడగనివాళ్లకూ.. అందరికీ పనిగట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చాడు. టాక్ షోలలో కనిపించి సందడి చేశాడు. బ్రహ్మోత్సవం వచ్చేసింది.. రిజల్ట్ కూడా తెలిసిపోయింది. మహేష్ ఇక రిలాక్స్ అయిపోవొచ్చు. అందుకే తన కుటుంబంతో కలసి లండన్ వెళ్లిపోతున్నాడు. ఈరోజే లండన్ ఫ్లైట్ ఎక్కేస్తున్నాడు మహేష్. అక్కడ పదిహేను రోజుల పాటు విశ్రాంతి తీసుకొని, తిరిగొచ్చి మురుగదాస్ సినిమాని మొదలెడతాడు.
బ్రహ్మోత్సవం టాక్ బాగుంటే, కొన్ని రోజులు ఇక్కడే ఉండి ప్రమోషన్లు పెంచి, వసూళ్లు రాబట్టుకోవాలని మహేష్ భావించాడు. తిరుపతి, విజయవాడలలో సక్సెస్ మీట్ నిర్వహిద్దామనుకొన్నాడు కూడా. అయితే.. పూర్తిగా డిజాస్టర్ టాక్ రావడంతో ప్రమోషన్ చేసినా లాభం లేదన్నది మహేష్ ఉద్దేశం. అందుకే లండన్ వెళ్లిపోతున్నాడట.