సినిమాల నుంచి దాదాపు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విరామం తీసుకొన్నాడు చిరంజీవి. ఆమధ్య బ్రూస్లీలో కనిపించినా అది అతిథి పాత్రే! అందుకే ప్రస్తుతం అందరి దృష్టీ చిరంజీవి 150వ సినిమాపైనే కేంద్రీకృతమైంది. కొబ్బరికాయ్ కొట్టుకొన్న ఈ సినిమా.. ఇప్పుడు సెట్స్‌పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. స్ర్కిప్టు కూడా పూర్తికావడంతో షూటింగ్ మొదలెట్టడానికి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసినట్టు తెలుస్తోంది. జూన్ 6న చిరు – వినాయక్‌ల సినిమా సెట్స్‌పైకి వెళ్లబోతోందన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం.
నయనతారని కథానాయికగా ఎంచుకోవాలని చిరు బృందం విశ్వప్రయత్నాలు చేసినా, ఆమె కాల్షీట్లు అందుబాటులో లేకుండా పోయాయి. అందుకే అనుష్కతో ఫిక్సయినట్టు తెలుస్తోంది. చిరు – అనుష్క ఇది వరకు స్టాలిన్ లో ఓ పాటకు చిందులేశారు. పూర్తి స్థాయి జోడీగా కనిపించడం ఇదే తొలిసారి. జూన్ 6 నుంచి ఏకధాటిగా నెల రోజుల పాటు హైదరాబాద్‌లోనే చిత్రీకరణ జరపాలని వినాయక్ బృందం నిర్ణయించుకొంది. 2017 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.