టాలీవుడ్లో హీరోలకు సమ్మర్ మూడ్ ఇప్పుడొచ్చింది. మహేష్‌బాబు ఆల్రెడీ లండన్ వెళ్లిపోయాడు. రెండు వారాలకు గానీ తిరిగిరాడు. ఇప్పుడు నందమూరి బాలకృష్ణ కూడా… ఫారెన్ చెక్కేస్తున్నాడు. ఈనెల 20 వరకూ బాలకృష్ణ మొరాకోలో ఉన్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి షూటింగ్ అక్కడే జరిగింది. మొరాకో నుంచి తిరిగొచ్చాక బాలయ్య మనసు విశ్రాంతి వైపు మళ్లింది. జూన్ ద్వితీయార్థంలో హైదరాబాద్ లో రెండో షెడ్యూల్ ప్రారంభం కానుంది. అంత వరకూ బాలయ్య విశ్రాంతి తీసుకోవాలనుకొంటున్నార్ట.
అందుకే జూన్ 1న బాలకృష్ణ అమెరికా వెళ్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. అక్కడ రెండువారాల పాటు విశ్రాంతి తీసుకొని తిరిగొస్తారట. బాలయ్యతో పాటు మోక్షజ్ఞ కూడా అక్కడకి వెళ్తున్నాడని తెలుస్తోంది. గౌతమి పుత్ర కోసం బాలయ్య ఇప్పటికే పదికిలోలు తగ్గాడు. ఇప్పుడు మరింత తగ్గాలని భావిస్తున్నాడు. అమెరికాలో బాలయ్య బరువు తగ్గేందుకు ప్రత్యేకమైన కసరత్తులు చేసొస్తాడట. అంటే బాలయ్యని త్వరలో మరింత స్లిమ్‌గా చూడొచ్చన్నమాట.