పెద్ద సినిమాలు ఒకట్రెండు వచ్చినా, అందులో ఒకటీ అరా విజయం సాధించినా.. ఈ సమ్మర్ అంత సందడి లేదన్నది వాస్తవం. సరైనోడు, సర్దార్, బ్రహ్మోత్సవం… ఈ వేసవిలో ఊరించాయి. సరైనోడు మాస్ మసాలా మూవీగా మిగిలింది. సర్దార్ – గబ్బర్‌సింగ్ బోల్తాపడితే, బ్రహ్మోత్సవం పూర్తిగా నిరాశ పరిచింది. ఈ వేసవిలో కుటుంబ ప్రేక్షకుల మొత్తాన్ని థియేటర్‌కి రప్పించిన సినిమా ఒక్కటీ లేదు. దాంతో ఇప్పుడు అందరి కళ్లూ అఆ పై పడ్డాయి. త్రివిక్రమ్ సినిమా అంటే ఆ క్రేజ్ మామూలుగా ఉండదు. ఫ్యామిలీ మొత్తాన్నీ థియేటర్లో కూర్చోబెట్టగలిగే పెన్ను ఆయనది. నితిన్, సమంత, నదియా.. కాస్టింగ్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ట్రైలర్ ఆకట్టుకొంది. సెన్సార్ రిపోర్ట్ కూడా సూపర్బ్‌గా ఉంది. దాంతో అఆపై అంచనాలు పెరిగాయి. కనీసం ఈ సినిమా అయినా ఈ సమ్మర్లో బ్లాక్ బ్లస్టర్గా మిగులుతుందన్న ధీమా కలుగుతోంది.
ఐపీఎల్ సీజన్ కూడా ముగిసిపోతోంది. వేసవి సెలవులు ముగిసే ముందు మరింత వినోదం, విరామం కావాలనుకొంటారంతా. స్కూళ్లు తెరచే రెండు వారాల ముందు వస్తున్న అఆ… నిలబడితే – భారీ వసూళ్లు రాబట్టుకోవడం ఖాయం. పైగా త్రివిక్రమ్ సినిమాలకు ఓవర్సీస్లో, ఏ క్లాస్ సెంటర్లలో విపరీతమైన గిరాకీ. పైగా అఆ పల్లెటూరి బ్యాక్ డ్రాప్లో సాగే కథ. ఎక్కితే సీ సెంటర్‌కీ బాగా ఎక్కేస్తుంది. అందుకే… అఆ సమ్మర్ హిట్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.