ఒకప్పుడు ఐటెమ్ పాటతో ఒక ఊపు ఊపేసింది ముమైత్‌ఖాన్. కమర్షియల్ సినిమా అంటే ఐటెమ్ సాంగ్ ఉండాల్సిందే, ఐటెమ్ సాంగ్ అంటే అందులో ముమైత్‌ఖాన్ చిందేయాల్సిందే అన్నంతగా సాగింది ఆమె హవా. ఒక దశలో టాప్ హీరోయిన్లకు సైతం షాకిచ్చేంత పారితోషికం అందుకొంది. క్రమంగా ఐటెమ్ పాటతో పాటు ఆమె హవా కూడా తగ్గింది. ముమైత్ ఖాన్‌ని అంతా మర్చిపోయారు. స్లిమ్‌గా మారి, కొత్తాందాలతో మెరిసినా ఆమెనెవరూ పట్టించుకోవడం లేదు. దాంతో.. ఏం చేయాలో తెలీక, ఆదాయ మార్గం లేక – గ్రామాల్లో జరిగే జాతర్లకు సైతం స్టెప్పులేసేంతగా దిగజారిపోయింది.
విశాఖ జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో జరిగిన జాతర్లో ముమైత్ ఖాన్ పాల్గొని, స్టెప్పులేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. స్థానిక నాయకుల ప్రొగ్భతంతో ముమైత్ ఈ వేడుకకు వచ్చినా, అమె అందుకొన్న రొక్కం మాత్రం వేలల్లోనే అని సమాచారం. పాటకు ఇరవై లక్షలు తీసుకొన్న ముమైత్ ఖాన్.. ఇంత తక్కువ మొత్తానికి స్టెప్పులేయడానికి ఒప్పుకొందంటే, అదీ ఏమాత్రం రక్షణ లేని చోట… ముమైత్ ఖాన్ పరిస్థితి ఎంతకు దిగజారిందో అర్థం చేసుకోవొచ్చు. ఆమధ్యన తనకు తెలిసిన దర్శకుల చుట్టూ అవకాశాల కోసం తెగ తిరిగిందట. కానీ… వాళ్లంతా హ్యాండివ్వడంతో ఏం చేయాలో పాలుపోక.. వచ్చిన ఇలాంటి చిన్నా చితకా ఆఫర్లను ఒప్పుకొంటోంది. పాపం..!