ఈ సమ్మర్లో కాజల్ నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అవే… సర్దార్ – గబ్బర్‌సింగ్, బ్రహ్మోత్సవం. ఈ రెండు సినిమాలూ డిజాస్టర్లుగా మిగిలిపోయాయి. దాంతో కాజల్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. గత కొన్నాళ్లుగా కాజల్ పరిస్థితి బాలేదు. తెలుగులో ఆమెను పట్టించుకోవడమే మానేశారు. అందుకే సర్దార్, బ్రహ్మోత్సవం అవకాశాలు రాగానే పండగ చేసుకొంది. రెండూ స్టార్ల చిత్రాలే! ఇందులో ఒకటి హిట్ అయినా.. తన కెరీర్‌కి మరికొన్నాళ్ల పాటు ఢోకా ఉండదు అని భావించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ రెండు సినిమాలూ భారీ ఫ్లాపులుగా మిగిలి, కాజల్ ని వితప్కర పరిస్థితుల్లో నెట్టేశాయి.
నవతరం కథానాయికల జోరు మధ్య కాజల్ నిలబడాలంటే, కనీసం ఓ సూపర్ హిట్టయినా కొట్టాలి. అయితే ఈ వరుస ఫ్లాపులతో కాజల్ కెరీర్‌పై పెట్టుకొన్న ఆశలు అడుగంటినట్టైంది. మరో భారీ ఆఫర్ అందుకోవాలంటే కాజల్ కి యేడాదైనా పట్టొచ్చు. ఈలోగా ఎంతమంది కొత్త కథానాయికలు వస్తారో.. కాజల్ స్థానానికి ఎవరు ఎసరు పెడతారో చెప్పలేం. ఇప్పుడు కాజల్ ఆశలన్నీ హిందీ సినిమాపైనే ఉన్నాయి. దో లవ్జోంకీ కహానీ సినిమా కూడా అటూ ఇటూ అయితే.. కాజల్ కెరీర్ ఖతమైనట్టే.