బ్రహ్మోత్సవం దెబ్బకు బయ్యర్లు బెంబేలెత్తిపోయారు. సగం డబ్బులు కూడా తిరిగి రావడం కష్టమని తేలిపోయింది. ఇప్పుడు వాళ్లని ఆదుకొనే బాధ్యత పీవీపీపై పడింది. ‘మేం ఆదుకొంటాం’ అని పీపీపీ, మహేష్ నేరుగా చెప్పకపోయినా, అందుకు తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. బ్రహ్మోత్సవం బాధితుల్ని ఆదుకోవడానికి పీవీపీ ఇప్పుడు మరో సినిమాని టేకప్ చేయబోతోందని, ఈసారీ మహేష్‌తోనే ఆ సినిమా ఉంటుందని, దర్శకుడిగా వంశీపైడిపల్లిని ఎంచుకొన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. వీటిపై పీవీపీ ప్రతినిధి బృందం స్పందించింది. తెలుగు 360 తో పీవీపీ ప్రతినిధి ఒకరు మాట్లాడారు కూడా.
”మహేష్‌తో ఓ సినిమా చేస్తున్నామన్న విషయంలో ఎలాంటి వాస్తవం లేదు. అదంతా గాసిప్పే. వంశీపైడిపల్లితో ఓ సినిమా చేద్దామనుకొన్నాం. అయితే హీరో ఎవరన్నది ఇంకా తేలలేదు. మహేష్ తో మాత్రం కాదు..” అని క్లారిటీ ఇచ్చేసింది. బ్రహ్మోత్సవం ప్రభావం నుంచి పీవీపీ బయటపడడానికి ఇంకా టైమ్ పట్టేట్టుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా గురించి ఆలోచించే ధైర్యం చేయట్లేదు పీవీపీ. మరి బయ్యర్ల నష్టాల్ని ఎలా తీరుస్తారో చూడాలి.