ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి పోలీస్స్టేషన్ మెట్లు ఎక్కారు. ఓ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నరేష్ అనే ఓ యువకుడు తనకు ఫోన్లో అసభ్యకరమైన సందేశాలు పంపుతున్నాడని, విసిగిస్తున్నాడని, అతని వల్ల తనకూ తన కుటుంబానికీ ప్రాణహాని కూడా ఉందని.. ఫిర్యాదు చేశారు పోసాని. ఈ మధ్యాహ్నం హైదరాబాద్లోని ఎస్.ఆర్.నగర్ పోలీస్ స్టేషన్కివెళ్లిన పోసాని.. అక్కడ పోలీసులతో కాసేపే ఈ కేసు విషయమై మాట్లాడి, చివరకు ఫిర్యాదు ఇచ్చి వచ్చారు. ఈ విషయమై పోలీసులు కూడా వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.