జాదూగాడుతో ఎంట్రీ ఇచ్చింది.. బుల్లితెర సోయగం సోనారిక. తొలి సినిమాలోనే హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది. స్పీడున్నోడులోనూ తన స్పీడు చూపించింది. ఈడోరకం – ఆడోరకంలో మరింత రెచ్చిపోయింది. ఇన్ని చేసినా… ఆమెను గ్లామర్ డాల్‌గా చూడడం లేదనుకొందేమో, ఈమధ్య కొన్ని బికినీ పోజుల్ని వదిలింది. అది చూసి.. అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ పాప మరీ ఇంతిలా శ్రుతిమించిందేంటి? అని ముక్కున వేలేసుకొంటున్నారు. అయితే సోనారిక ప్లాన్.. చాలా పెద్దదే ఉందట. గ్లామర్ క్వీన్‌గా గుర్తింపు తెచ్చుకొన్నవాళ్లకు తెలుగునాట ఇమేజ్ వేరుగా ఉంటుందని గ్రహించింది సోనారిక. పెద్ద హీరోల పక్కన అవకాశాలు రావాలంటే… ఈమాత్రం శ్రుతిమించక తప్పదని భావించిందేమో?
చిన్న సినిమాలు ఎన్ని చేసినా, అందులో ఎన్ని హిట్లు కొట్టినా… పెద్ద సినిమాలు చేసినంత క్రేజ్ రాదు. పైగా గ్లామర్ భామలకే ఐటెమ్ పాటల అవకాశాలు దక్కుతుంటాయి. మనసులో ఆ ఉద్దేశాలు పెట్టుకొనే సోనారిక.. ఇలా బికినీ పోజుల్ని బయటకు వదిలిందని గుసగుసలాడుకొంటున్నారు. ఈ హాట్ ప్రదర్శనతో అయినా. తకకు ఇబ్బుడిముబ్బిడిగా అవకాశాలు వస్తాయని, ఒక్కసారిగా టాప్ రేంజులోకి వెళ్లిపోవచ్చన్నది నిహారిక స్కెచ్ అయ్యింటుంది. మరి.. ఈ గ్లామర్ షోకి ఎన్ని సినిమాలు రాలతాయో.. కాలమే చెప్పాలి. ఈలోగా నిహారిక హాట్ ప్రదర్శన చూసి కుర్రకారు పండగ చేసుకొంటున్నారు.