సరైనోడుగా ఈ సమ్మర్లో మంచి హిట్టు కొట్టాడు అల్లు అర్జున్. నెగిటీవ్ టాక్ వచ్చినా సరే, సినిమాని నిలబెట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. తెలుగు నాట ఈ సినిమా రూ.70 కోట్ల షేర్ సాధించింది. ఇప్పుడు మలయాళంలోనూ విడుదలైంది. బన్నీకి అక్కడ కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ శుక్రవారం మల్లూవుడ్‌లో ఈ చిత్రం యోధావు – ది వారియర్ పేరుతో విడుదలైంది. దాదాపు 80 స్ర్కీన్స్‌లో ఈ సినిమాని విడుదల చేశారు. చాలా చోట్ల హోస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. తొలి రోజు దాదాపుగా 65 లక్షల రూపాయల వరకూ వసూళ్లు వచ్చినట్టు టాక్.
మల్లూవుడ్‌లో ఓ పెద్ద హీరో సినిమాకి ఎన్ని వసూళ్లు వస్తాయో.. బన్నీ సినిమాకి అన్నే వచ్చాయని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తోంది. అక్కడ ఈ సినిమా దాదాపు రూ.4 కోట్ల వరకూ వసూలు చేసే అవకాశాలు న్నాయని టాక్. కేరళలో బన్నీ ఈ సినిమా కోసం విపరీతంగా ప్రచారం చేశాడు. అది కూడా భారీ ఓపెనింగ్స్ రావడానికి దోహదపడ్డాయి. నాలుగు వారాలు ఆలస్యంగా విడుదలైనా.. మల్లూవుడ్‌లో మంచి వసూళ్లు రావడం పట్ల బన్నీ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడట. సొంత సినిమా కదా, అందుకే అంత హుషారు.