మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం సాయంత్రం తిరుపతిలో మహానాడు సమావేశాల అనంతరం కలిసినట్లు సమాచారం. ఆయన 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత వైకాపాని వీడి బయటకు వచ్చేశారు. అప్పటి నుంచి ఏ పార్టీలోను చేరకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కొన్ని వారాల క్రితం ఆయన అనుచరులు గండి బాజీ, సర్వేశ్వర రావు తెదేపాలో చేరారు. వారితోబాటే కొణతాల కూడా చేరుతారని అందరూ భావించినప్పటికీ ఆయన మాత్రం చేరలేదు ఎందుకో. కానీ ఆ తరువాత ప్రధాని నరేంద్ర మోడీకి హామీల అమలు గురించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రాలో ప్రాజెక్టుల గురించి లేఖలు వ్రాసి రాజకీయాలలో తన ఉనికిని చాటుకొంటున్నారు. ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కలిసినట్లు తెలుస్తోంది కనుక త్వరలోనే తెదేపాలో చేరుతారేమో? చాలా కాలం క్రితమే చంద్రబాబు నాయుడు ఆయనని పార్టీలో ఆహ్వానించారు కనుక ఇప్పుడు తనంతట తానే వచ్చారు కనుక తెదేపాలోకి సాదరంగా ఆహ్వానించవచ్చు.