వరుస విజయాలతో సాయిధరమ్ తేజ్ మోస్ట్ వాంటెడ్ హీరో అయిపోయాడు. సాయితో సినిమా చేయాలని నిర్మాతలు క్యూ కడుతున్నారిప్పుడు. దర్శకులూ కథలు సిద్ధం చేస్తున్నారు. తాజాగా మారుతి కూడా సాయిధరమ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడని టాక్. దానికి సాయి కూడా ఓకే అనేశాడట. ప్రస్తుతం మారుతి బాబు బంగారంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకొంది. ఈసినిమా పూర్తయిన వెంటనే సాయిధరమ్‌తో ఓ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. సాయిధరమ్ కాంపౌండ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ”సాయికీ, మారుతికీ మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. వీళ్లు తరచూ కలుస్తుంటారు. మాటల ప్రస్తావనలో సాయికి ఓ లైన్ కూడా వినిపించారు మారుతి. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుంది” అంటున్నారు వాళ్లు.
బాబు బంగారంలపై మంచి టాక్ నడుస్తోంది. ఈ సినిమా మినిమం యావరేజ్ అయినా.. మారుతి టాప్ లీగ్‌లోకి చేరిపోవడం ఖాయం. ఒక్కసారి టాప్ దర్శకుల జాబితాలో చేరిపోతే.. పెద్దహీరోలపైనే దృష్టి పడుతుంది. అలాంటప్పుడు సాయిధరమ్‌తో సినిమా చేసే ఛాన్సుండదు. కానీ మారుతి మాత్రం కథకీ, రిలేషన్‌కీ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తీ అని.. ఈ కాంబినేషన్‌లో సినిమా రావడం ఖాయమని మారుతి సన్నిహిత వర్గాలు సైతం చెబుతున్నాయి. సో.. కాంబో సెట్టయిపోయినట్టే.