పవన్ కల్యాణ్ పేరునీ, పాటని, డైలాగ్‌నీ వాడుకోవాలంటే నితిన్ తరవాతే ఎవరైనా. పవన్‌పై కాపీ రైట్స్ అన్నీ నావే అనుకొంటుంటాడు నితిన్. దానికి తగ్గట్టు నితిన్ ఇమిటేషన్‌ని పవన్ ఫ్యాన్స్ కూడా బాగానే ఎంజాయ్ చేస్తారు. నితిన్ నా తమ్ముడులాంటోడు అని పబ్లిక్ ముందే.. పవన్ కూడా మనసు విప్పాడు. దాంతో పవన్ ఫ్యాన్స్ కూడా `నితిన్ సినిమా కూడా మనదే` అనే విశాల దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మరోవైపు త్రివిక్రమ్ కూడా అంతే. పవన్ – త్రివిక్రమ్ దోస్తీపై కొత్తగా చెప్పేదేం లేదు. ఆయన సైన్యం.. నేను యుద్ధం అన్న టైపులో త్రివిక్రమ్ కూడా అ.ఆ ఫంక్షన్లో తెగ మాట్లాడేశాడు. పవన్‌ని వాడుకోవడంలో అటు నితిన్ ఎంత సక్సెస్ అయ్యాడో, ఇటు త్రివిక్రమ్ కూడా అంతే సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు వీరిద్దరూ కలసి చేసిన ‘అ.ఆ’ ప్రమోషన్లకూ పవన్ పేరు తప్పని సరి అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్లలో పవన్‌ని ఎలా వాడుకొందామా అని త్రివిక్రమ్, నితిన్‌లు తర్జన భర్జనలు పడుతున్నార్ట.
పవన్ కోసం ‘అ.ఆ’ ప్రీమియర్ షోని ఎరేంజ్ చేస్తే ఎలా ఉంటుంది? అన్నది త్రివిక్రమ్ ఆలోచన. కనీసం పవన్ – త్రివిక్రమ్ – నితిన్‌లతో ఓ ఇంటర్వ్యూ చేయించి బయటకు వదులుదాం… అని కూడా అనుకొన్నారు. అయితే పవన్ ప్రస్తుతం ఉర్లో లేడని టాక్. అందుకే కనీసం పవన్‌తో ఓ బైటు అయినా తీసుకొందాం అని త్రివిక్రమ్ ఫిక్సయ్యాడట. పవన్ అందుబాటులోని రాగానే పవన్‌ని సినిమా చూపించి, ఈసినిమా కోసం నాలుగు ముక్కలు మంచిగా చెప్పించి, దాన్ని విస్ర్కృతంగా వాడుకొందామని భావిస్తున్నార్ట. ఎలాగోలా పవన్‌ని అ.ఆ ప్రమోషన్లలో వాడడం ఖాయంగా కనిపిస్తోంది. చూద్దాం.. పవన్ మాట ఎంత వరకూ చెల్లుబాటు అవుతుందో?