త్రివిక్రమ్ అ.ఆ మరి కొద్ది గంటల్లో థియేటర్లలో సందడి చేయబోతోంది. త్రివిక్రమ్ సినిమా కాబట్టి.. అంచనాలెప్పుడూ ఓ రేంజులోనే ఉంటాయి. పైగా.. సమ్మర్ సీజన్లో వచ్చే లాస్ట్ మూవీ! ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే సినిమా అని అర్థమైపోతుంది కాబట్టి, కుటుంబ ప్రేక్షకులు చాలా కాలం తరవాత మళ్లీ థియేటర్లకొచ్చే అవకాశం ఉంది. ఏమాత్రం సినిమా ‘బాగుంది’ అన్న టాక్ తెచ్చుకొని.. బాక్సాఫీసుని ఓ దుమ్ము దులపడం ఖాయం. త్రివిక్రమ్ తన పంథాని పూర్తిగా మర్చుకొని తీసిన సినిమా ఇదని… చిత్ర యూనిట్ చెబుతోంది. తొలిసారి ఓ ప్రేమకథని టచ్ చేశాడట. నితిన్ – సమంతల లవ్ ట్రాక్ చాలా కొత్తగా వచ్చిందని, సమంత క్యారెక్టరైజేషనే ఈసినిమాకి ప్రాణమణి చెబుతున్నారు. ఫస్టాఫ్‌లో వచ్చిన సీన్స్ హిలేరియస్‌గా పండాయట.
సినిమా ఎప్పుడు మొదలైందో.. ఎప్పుడు ఇంట్రవెల్ కార్డు పడిందో తెలియనంత జోష్‌గా స్ర్కీన్ ప్లే సాగిందని, త్రివిక్రమ్ రాసుకొన్న వినోదాత్మక సన్నివేశాలు ఈ సినిమాని నిలబెట్టడం ఖాయమని టాక్. సెకండాఫ్ ఎమోషన్ల చుట్టూ సాగిందట. నదియా – సమంత – నితిన్ మధ్య నడిచే ఎమోషనల్ ట్రాక్ ఈ సినిమాకి బలం అని తెలుస్తుంది. సినిమా కంటెంట్ అంతా సెకండాఫేనట. అక్కడ ఎక్కువగా సీరియస్ మూడ్‌లో సినిమా సాగిందట. ఆ సీన్స్ పండితే.. ఈ సినిమా హిట్టయిపోవడ ఖాయమంటున్నాయి ఫిల్మ్‌నగర్ వర్గాలు. సమంత – నితిన్ లవ్ ట్రాక్, ఎమోషన్ సీన్స్‌పైనే అ.ఆ ఆధారపడి ఉందని. అవి రెండూ ఎక్కితే.. ఈ సినిమా ఎక్కడో ఉంటుందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.